Tuesday, May 14, 2024
HomenationalKamal Haasan : షర్మిలకు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన కమల్‌ హాసన్

Kamal Haasan : షర్మిలకు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన కమల్‌ హాసన్

Telugu Flash News

ఉద్యోగం కోల్పోయిన మహిళా డ్రైవర్ షర్మిలకు ప్రముఖ నటుడు, ఎంఎన్‌ఎం పార్టీ అధినేత కమల్‌హాసన్‌ (Kamal Haasan) అండగా నిలిచారు. ఆమెకు కారు బహుమతిగా ఇస్తున్నట్లు వెల్లడించారు. కమల్ కల్చరల్ సెంటర్ తరపున కారు ఇస్తున్నామని కమల్ వివరించారు. షర్మిల ఇప్పటి వరకు ఉద్యోగిగా ఉన్నారని, ఎక్కువ మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కమల్ అన్నారు. కోయంబత్తూరులో తొలి మహిళా డ్రైవర్‌గా పేరుగాంచిన షర్మిలకు ఇలా జరిగిందని కమల్ అన్నారు. మహిళలకు స్ఫూర్తిదాయకమని, కేవలం డ్రైవర్‌గానే మిగిలిపోవద్దని, మరెన్నో షర్మిలను రూపొందించాలని ఆకాంక్షించారు.

తాము అందించే కారును క్యాబ్ సర్వీసులకే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తగా ఎదగాలని కమల్ హాసన్ సూచించారు. మహిళా డ్రైవర్ షర్మిలను మరియు ఆమె కుటుంబ సభ్యులను కమల్‌హాసన్‌ తన కార్యాలయానికి పిలిచి వారితో మాట్లాడారు. షర్మిల లాంటి మహిళలు ఈ తరానికి అవసరమని కొనియాడారు.

ఎవరీ షర్మిల?

షర్మిల ఎంతో నైపుణ్యంతో డ్రైవింగ్ నేర్చుకుని భారీ వాహనం అయిన బస్సును నడుపుతూ అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాదు కోయంబత్తూరులో తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా గుర్తింపు పొందింది. అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. షర్మిల ధైర్యసాహసాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజకీయ నేతలు, వీవీఐపీలు కూడా నేరుగా షర్మిలపై ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా వచ్చాయి. డీఎంకే ఎంపీ కనిమొళి కోయంబత్తూరులో స్థానిక బస్సులో ప్రయాణిచినప్పుడు కూడా బస్సు డ్రైవర్ షర్మిలను ప్రశంసించారు. దీంతో షర్మిల పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది.

అయితే ఒక్కసారిగా షర్మిలకు వచ్చిన పాపులారిటీ ఆమెకు శాపంగా మారింది. షర్మిలను యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. ఇలా తొలగించడానికి కంపెనీ చెప్పిన కారణం వింటే షాక్ అవుతారు. షర్మిలకు పబ్లిసిటీపై మోజు ఉందని, పాపులారిటీ కోసం బస్సులోని ప్రయాణికులను పట్టించుకోవడం లేదని యాజమాన్యం చెబుతోంది.

ఇటీవల డీఎంకే ఎంపీ కనిమొళి కోయంబత్తూరులో స్థానిక బస్సులో ప్రయాణించారు. ఆ రోజు ఆ సమయంలో బస్సును ఆ పాపులర్ మహిళా డ్రైవర్‌ షర్మిలనే నడిపింది. మహిళా డ్రైవర్ డ్రైవింగ్ నైపుణ్యాన్ని మెచ్చుకున్న కనిమొళి ఆమెకు వాచ్‌ను బహుమతిగా ఇచ్చింది.

కాగా, తన బస్సులో డ్యూటీలో ఉండగా ట్రైనీ కండక్టర్ కనిమొళితో దురుసుగా ప్రవర్తించిందని మహిళా డ్రైవర్ షర్మిల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అయితే, తన బస్సులో ప్రయాణించమని ప్రముఖులను ఆహ్వానించడం ద్వారా మహిళా డ్రైవర్ సాధారణ ప్రయాణికులను వేధిస్తున్నారని కండక్టర్ ఆరోపించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బస్సు యాజమాన్యం చివరకు మహిళా డ్రైవర్ షర్మిలను విధుల నుంచి తప్పించింది.

-Advertisement-

అయితే ఎంపీ కనిమొళిని కలిసినందుకే షర్మిలను ఉద్యోగం నుంచి తొలగించారని కొందరు, షర్మిల తీరుపై అసహనంతోనే ఆమెను తొలగించారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ షర్మిల వెర్షన్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ట్రావెల్ యాజమాన్యం నన్ను అవమానించిందని అందుకే ఉద్యోగం మానేసినట్లు చెబుతోంది.

read more news:

MS Dhoni : విమానంలో క్యాండీ క్రష్ ఆడిన ధోనీ.. వీడియో వైరల్‌

Uppal Skywalk : ఉప్పల్ స్కై వాక్ వీడియో చూశారా ? ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News