HomenationalBoney Kapoor : కర్ణాటకలో బోనీకపూర్‌ వాహనంలో వెండి వస్తువులు సీజ్‌.. అసెంబ్లీ ఎన్నికల వేళ కలకలం

Boney Kapoor : కర్ణాటకలో బోనీకపూర్‌ వాహనంలో వెండి వస్తువులు సీజ్‌.. అసెంబ్లీ ఎన్నికల వేళ కలకలం

Telugu Flash News

Boney Kapoor : కర్ణాటకలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తరుణంలో ఓటర్లను ప్రలోభపెట్టే ఉదంతాలు పెరిగాయి. కానుకల రూపంలో వారికి రకరకాల వస్తువులు, డబ్బు పంచుతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్నీ చెకింగ్‌ చేయనిదే ముందుకు కదలనివ్వడం లేదు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన కారులో వెండి వస్తువులు లభించడం కలకలం రేపుతోంది. ఈ పరిణామంతో అటు బాలీవుడ్‌లోనూ, ఇటు కర్ణాటక రాష్ట్రంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని రోజుల్లోనే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో తనిఖీలు ముమ్మరం అయ్యాయి.

రాష్ట్రంలోని దావణగెరె ఔట్స్‌కట్‌లో ఉన్న హెబ్బళు టోల్‌ ప్లాజా సమీపంలో ఎన్నికల కమిషన్‌ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఓ బీఎండబ్ల్యూ కారులో పెద్ద ఎత్తున వెండి వస్తువులు లభ్యమయ్యాయి. 5 బాక్సుల్లో వీటిని భద్రపరిచారు. చెన్నై నుంచి ముంబై నగరానికి తరలిస్తున్న వీటికి సరైన పత్రాలు చూపలేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. కారులో మొత్తం 66 కిలోల వెండి గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు ఉన్నట్లు గుర్తించారు.

Ram Charan: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ స్టోరీ లీక్… ఇండస్ట్రీ హిట్ పక్కా అంటున్న ఫ్యాన్స్

ఈ వెండి వస్తువుల విలువ సుమారు 39 లక్షల రూపాయలకుపైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కారు నడుపుతున్న డ్రైవర్‌ సుల్తాన్‌ ఖాన్‌, వెహికల్‌లో ఉన్న మరో వ్యక్తి హరిసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వారిపై కేసు కూడా నమోదైంది. విచారణలో ఈ కారు బాలీవుడ్‌ నిర్మాత బోనీ కాపూర్‌ కుటుంబానికి చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందినదిగా తేలింది.

మరోవైపు ఈ వెండి వస్తువులు సైతం బోనీ కపూర్‌ కుటుంబానికి చెందినవేనని కారులో ఉన్న వ్యక్తులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. వీటికి సరైన పత్రాలు చూపలేదని పోలీసులు తెలిపారు. అయితే, దీనిపై పూర్తి విచారణ అనంతరం అవి బోనీ కపూర్‌కు చెందినవా కాదా? అనే వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు.

-Advertisement-

Rashmika: ర‌ష్మిక.. రిషబ్ శెట్టి నెంబ‌ర్‌ని బ్లాక్ చేసిందా.. అస‌లేం జ‌రిగింది ?

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ పార్టీల నేతలు వివిధ పద్ధతులు అనుసరిస్తున్నారు. దీంతో ఎన్నికల కమిషన్‌ దీనిపై దృష్టి సారించింది. చాలా ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు పెట్టి తనిఖీలు చేపట్టారు. అనుమానం ఉన్న వాహనాలను, వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News