Sunday, May 19, 2024
HomecinemaKamal Haasan : జోరు పెంచిన కమల్ హాసన్.. వరుసగా ఆరు సినిమాలు లైన్ లో ..

Kamal Haasan : జోరు పెంచిన కమల్ హాసన్.. వరుసగా ఆరు సినిమాలు లైన్ లో ..

Telugu Flash News

Kamal Haasan : ‘విక్రమ్’ సినిమా పాన్-ఇండియా విజయం తర్వాత, లోకనాయకుడు కమల్ హాసన్ బిజీ అయిపోయాడు. పాన్ ఇండియా సినిమాలు వరుసగా ఉన్నాయి. ప్రస్తుతం శంకర్‌తో భారతీయుడు 2 విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మణిరత్నం-కమల్ హాసన్ కాంబోలో ఓ సినిమా రూపొందుతోంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుండడంతో ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఇలా ఈ చిత్రానికి ‘థగ్ లైఫ్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ రెండూ కాకుండా కమల్ నుంచి రాబోయే సినిమాల లిస్ట్ పెద్దదే. మణిరత్నంతో సినిమా తర్వాత లోకేష్ జనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ 2 సినిమా చేయబోతున్నాడు కమల్. దానికి సంబంధించిన కసరత్తును లోకేష్ ఇప్పటికే ప్రారంభించారు. దిని తర్వాత దర్శకుడు హెచ్ వినోద్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నాడు. ఈ చిత్రాన్ని కమల్ స్వయంగా నిర్మిస్తారని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అలాగే శంకర్ తో మళ్లీ ఇండియన్ 3 సినిమా ఉంటుంది.

ఇండియన్ పార్ట్ 2లో ఇండియన్ 3 క్లూ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.ప్రభాస్ కల్కి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ లైనప్ చూస్తుంటే మరో మూడేళ్ల వరకు ఆయన బిజీ బిజీ గా ఉన్నాడనే చెప్పాలి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News