HomesportsICC: పాకిస్తాన్‌కి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన ఐసీసీ... మ‌రోసారి అలా చేస్తే ఇక అంతే..!

ICC: పాకిస్తాన్‌కి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన ఐసీసీ… మ‌రోసారి అలా చేస్తే ఇక అంతే..!

Telugu Flash News

ICC: మూలిగే న‌క్క మీద తాటి పండు ప‌డ్డ‌ట్టు అయింది పాక్ పరిస్థితి. ఇప్ప‌టికే ఇంగ్లండ్ పై రెండు టెస్ట్‌లు ఓడిన పాక్‌కి ఐసీసీ పెద్ద షాక్ ఇచ్చింది. టెస్ట్ క్రికెట్ ఆడటం కోసం 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డ మీద అడుగుపెట్టిన ఇంగ్లాండ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పాక్‌పై గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రావల్పిండి వేదికగా నిర్వహించిన తొలి టెస్టు కోసం బ్యాటింగ్ పిచ్ రూపొందించిన పాక్.. ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ కోసం బౌలింగ్ పిచ్ రూపొందించింది భంగపాటు ప‌డింది. ఏమాత్రం జీవం లేని రావల్పిండి పిచ్ మీద ఇంగ్లాండ్ బ్యాటర్లు చెల‌రేగి తొలి రోజే 500కిపైగా పరుగులు చేసి చరిత్ర సృష్టించారు. అయితే అలాంటి పిచ్‌పై కూడా ఇంగ్లండ్ బౌల‌ర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి త‌మ జ‌ట్టుకి విజ‌యాన్ని అందించారు.

అయితే రావల్పిండి పిచ్‌కి తాజాగా ఐసీసీ బిలో యావరేజ్‌గా రేటింగ్ ఇచ్చింది. రావల్పిండి పిచ్‌కు ఐసీసీ తక్కువ రేటింగ్ ఇవ్వడం వరుసగా ఇది రెండోసారి కాగా, ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ అనంతరం కూడా ఐసీసీ బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. దీంతో అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వకుండా సస్పెన్షన్ వేటును ఎదుర్కొనే ప్రమాదాన్ని రావల్పిండి క్రికెట్ స్టేడియం ఎదుర్కొనే ప్ర‌మాదం ఉంది. మ‌రోసారి ఇలాంటి పిచ్‌నే తయారుచేస్తే మాత్రం ఈ మైదానంలో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు జరగడం మాత్రం చాలా కష్టంగా మారే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో ఈ పిచ్‌పై భారీగా విమర్శలు రావ‌డంతో పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) చైర్మన్ రమీజ్ రజా సైతం పిచ్‌ నిర్వాహకులను విమర్శించాడు. పలువురు మాజీ దిగ్గజాలు కూడా ఇది టెస్టు మ్యాచ్ ఆడాల్సిన పిచ్ కాదని మండిప‌డ్డారు. వరుసగా రెండు టెస్టుల ద్వారా రావల్పిండి పిచ్‌కు రెండు డీమెరిట్ పాయింట్లు రాగా, మరిన్ని డీమెరిట్ పాయింట్లు వస్తే.. అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వకుండా సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. డీమెరిట్ పాయింట్లు ఐదేళ్లపాటు యాక్టివ్‌గా ఉంటాయి. ఏదైనా వేదికకు ఐదు డీమెరిట్ పాయింట్లు వస్తే.. అక్కడ 12 నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్ నిర్వహించకుండా సస్పెండ్ చేస్తారు అని ఐసీసీ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News