Monday, May 13, 2024
Homecinemaspecial stories : ఎనలేని అభిమానం, ఆదరణా పొందిన ఉదయ్ కిరణ్...

special stories : ఎనలేని అభిమానం, ఆదరణా పొందిన ఉదయ్ కిరణ్…

Telugu Flash News

special stories : సినిమాలలో నటించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కోట్లు సంపాదించాలని, జీవితాన్ని ఆనందించాలని ఆశపడతారు. కానీ తెరపై కనిపించే ప్రతి ఒక్క నటుడు/నటి జీవితం అలాగే ఉంటుందని కచ్చితంగా ఎవరూ చెప్ప లేరు. మామూలు మనిషి లాగే వారి జీవితాలలోనూ ఆనందాలతో పాటు బయటకి చెప్పలేని విషాదాలు ఉంటాయి. అయినప్పటికీ వారి బాధలను బయటకు తెలియనివ్వకుండా నటించి ప్రేక్షకులను అలరించిన వారు,అలరిస్తున్న వారు ఎంతో మంది. అలా జీవితంలో ఆనందాలతో పాటు బాధలను కూడా మోస్తూ ప్రేక్షకులను అలరించిన వారిలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు.

chitram-movie2000 లో ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు ఉదయ్ కిరణ్. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ఒక్క సారిగా ఉదయ్ కిరణ్ పేరు సినీ పరిశ్రమలో మారు మోగిపోయింది. దాంతో అతనితో సినిమాలు తీయడానికి దర్శక,నిర్మాతలు వరస కట్టారు.

ఫిల్మ్ ఫేర్ అవార్డు

ఆ తరువాత తీసిన నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని సినిమాలు కూడా అందర్నీ మెప్పించడంతో ప్రేక్షకులకు మరింత చేరువైయాడు ఉదయ్ కిరణ్. ఆతని నటనకు గాను వచ్చిన ఏడాదికే 2001లో ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు.

తన సినిమాలతో,తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఒక్క తెలుగు పరిశ్రమలోనే కాకుండా 2005లో తమిళ సినిమా పాయ్ లో నటించి అక్కడ కూడా తన ప్రతిభను చూపి అలరించాడు. 2003లో మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మితతో ఉదయ్ కిరణ్ కు నిశ్చితార్దం జరగినప్పటికీ ఆ పెళ్లి అనుకోని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది.

కొంత కాలం పెళ్లి విషయం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయిన ఉదయ్ 2012లో తనకు నచ్చిన విషిత అనే అమ్మాయిని పెళ్లాడాడు. అటు ప్రతి సినిమాలో తన విలక్షణమైన నటనతో అందర్నీ ఆశ్చర్య పరుస్తూ సినిమాలు మీద సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న ఉదయ్ కిరణ్, ఇటు వివాహ జీవితాన్ని కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నాడు. కానీ అలా సంతోషంగా తన జీవితాన్ని సాగిస్తున్న ఉదయ్ అనుకోని విధంగా ఆత్మ హత్య చేసుకుంటాడని ఎవరూ ఊహించలేదు.

ఉదయ్ కిరణ్ పెళ్ళైన రెండేళ్లకే 2014, జనవరి 6న శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్లో ఊరేసుకుని చనిపోయారు. ఎవరూ ఊహించని విధంగా ఉదయ్ అలా చనిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

-Advertisement-

ఉదయ్ కిరణ్ చనిపోయారన్న విషయం అభిమానులకు ఎంత బాధను కలిగించిందంటే,  పందొమ్మిది ఏళ్ల సతీష్ అనే బైక్ మెకానిక్ ఉదయ్ చనిపోయాడన్న బాధతో తను చనిపోయిన 4 రోజులకి జనవరి 10న తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు.

“నా అభిమాన హీరో ఉదయ్ కిరణ్ చనిపోవడం నేను తట్టుకోలేక చనిపోతున్నాను” అంటూ ఉత్తరం రాసి సతీష్ ఆత్మ హత్య చేసుకున్నాడని పోలీసులు చేసిన కేసు దర్యాప్తు లో పేర్కొన్నారు.

ఒక హీరోకి ఇంతటి అభిమానం చూపుతున్నారంటే ఉదయ్ కిరణ్ ఎలాంటి వాడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరలేదు.కానీ ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని విషయం ఏంటి అంటే ఉదయ్ అలా ఎందుకు చేశాడు అని.

నిజంగానే ఉదయ్ కిరణ్ ఆత్మ హత్య చేసుకున్నారా? లేక పోతే ఎవరైనా ఏమైనా చేశారా? అసలు అలా చేయాల్సిన అవసరం ఉదయ్ కి ఎందుకు వచ్చింది? ఇలా ప్రశ్నలు ఎన్నో కానీ సమాధానాలే లేవు.

also read news:

Uday Kiran: ఉదయ్ కిర‌ణ్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో త‌న‌కు తెలుసంటూ తేజ సంచ‌ల‌న కామెంట్స్

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News