HomehoroscopeToday Horoscope in Telugu | 22-05-2024 ఈ రోజు రాశి ఫలాలు

Today Horoscope in Telugu | 22-05-2024 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

today horoscope in telugu :  22-05-2024 తేదీన ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషరాశి

ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు స‌ఫ‌లం కావ‌డంతో సంతోషంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఆస‌క్తి చూపే ప్ర‌య‌త్నం చేస్తారు.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం వెతుక్కుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధించే అవకాశం ఉంది.కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు ఏ మాత్రం తీసుకోకుండా ఉండాలి.

మిథున రాశి

ఈ రాశి వారికి ఆరోగ్యం కొంతవరకు కుదుటపడుతుంది. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతున్నా పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేసే అవ‌కాశం ఎక్కువగా ఉంది. కొందరు బంధువుల వల్ల ఇబ్బంది పడే అవ‌కాశాలు ఉన్నాయి. చేసే ప్ర‌తి ప‌ని కూడా ఆచి తూచి చేయ‌డం మంచిది.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి ఆరోగ్య ప‌రంగా చాలా బాగుంటుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త ఒకటి మీ చెవిన ప‌డే అవ‌కాశం ఉంది.. అనుకోని విధంగా మొండి బాకీ ఒకటి వసూలు అయ్యే అవ‌కాశం కూడా ఉంది. చేసే ప‌త్రి ప‌నిలో కొంత శ్ర‌ద్ధ వ‌హించ‌డం త‌ప్ప‌నిస‌రి.

సింహ రాశి

ఈ రాశికి చెందిన వారి ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు కానీ ఖర్చుల కారణంగా అయితే త‌ప్ప‌క‌ ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి చాలా వేధింపులు ఉంటాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండ‌డం ఉత్త‌మం.. స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశం కూడా చాలా ఉంది.

-Advertisement-

కన్య రాశి

ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో కొన్ని తేడాలు వ‌స్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళ్లే అవ‌కాశం ఉంది.. దూరపు బంధువులతో మంచి వివాహ సంబంధం కుదిరే ఛాన్స్ ఉంది.. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు సాగుతారు.

horoscope today in teluguతుల రాశి

ఈ రాశి వారికి మనశ్శాంతి కాస్త తగ్గుతుంది. స్నేహితులతో కూడా చిన్న చిన్న‌ అపార్ధాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం అనేది ఉత్త‌మం. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది. ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు అన్ని కూడ ఫలిస్తాయి. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేసే అవ‌కాశం ఉంది.. బంధువుల దగ్గర నుంచి డబ్బులు వసూలు అవుతుంది.

ధనుస్సు రాశి

ఈ రాశి వారు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు క్ర‌మంగా ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తుంటారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుంచి చాలా మంచి గుర్తింపు లభించ అవకాశం ఎక్కువ.. ప్రేమ వ్యవహారాలు చాలావరకు అనుకూలంగానే ఉంటాయి.

మకర రాశి

ఈ రాశి వారికి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఎక్కువగా ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు ఎక్కువ‌గా ల‌భిస్తాయా. . ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం ఉత్త‌మం. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉంటే మంచిది.

కుంభ రాశి

ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేసే ఛాన్స్ ఉంది.. మానసిక ఒత్తిడి కొంత ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోయే ఛాన్స్ ఉంది.. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి ఏర్పడడం జ‌రుగుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది.

మీన రాశి

ఈ రాశి వారికి రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందిస్తుంది. బంధుమిత్రులతో సంబంధాలు క్ర‌మేపి మెరుగుపడతాయి. సన్నిహితులతో విందులు వినోదాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం మీరు వెతుక్కుంటారు. చేయాల్సిన ప్ర‌తి ప‌నిని ఆచి తూచి చేస్తారు.

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News