Wednesday, May 15, 2024
Homebeautydandruff : తలలో చుండ్రు పోవాలంటే ఏం చేయాలి ? పరిష్కార మార్గాలు ఇవే..

dandruff : తలలో చుండ్రు పోవాలంటే ఏం చేయాలి ? పరిష్కార మార్గాలు ఇవే..

Telugu Flash News

చుండ్రు (Dandruff) సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. జుట్టులోని చుండ్రు.. శరీరంపై, భుజాలపై పడుతుంటే చాలా చికాకుగా ఉంటుంది. పదిమందిలోకి వెళ్లాలంటే నామోషీగా ఫీలవుతుంటారు. ఈ నేపథ్యంలో అసలు చుండ్రు సమస్యలు ఎందుకు వస్తాయి? ఈ సమస్యను పరిష్కరించాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది తెలుసుకోవాలి. చుండ్రును నివారించుకోవడంపై చాలా మంది అశ్రద్ధ వహిస్తుంటారు. ఇది అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది.

చుండ్రు అనేది ఓ రకమైన చర్మ సమస్యగా చెబుతారు. ప్రస్తుత జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో ఈ సమస్య సాధారణమైపోయింది. డాండ్రఫ్‌ సమస్యతో బాధపడుతున్న వారికి తలలో దురదగా అనిపిస్తుంది. ఎప్పుడూ గోళ్లతో గోక్కుంటూ ఉంటారు. ఈ సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జుట్టు రాలడం మరింత ఎక్కువ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో ఇది మరింత ఎక్కువని చెబుతున్నారు.

అసలు చుండ్రు రావడానికి కారణాలను పరిశీలిస్తే.. ఎగ్జిమా, సోరియాసిస్‌ లాంటివి ప్రధాన కారణాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పొడి చర్మం, జుట్టు సంరక్షణ ఉత్పత్తులతో సైడ్‌ ఎఫెక్టులు రావడం, జిడ్డుగా తయారవడం, మలాసెజియా లాంటి చర్మ వ్యాధులు సోకిన సందర్భాల్లో డాండ్రఫ్‌ ఎక్కువగా సోకుతుందని చెబుతున్నారు.

తలలో చుండ్రు (dandruff) పోవాలంటే ఏం చేయాలి ?

చుండ్రును నివారించాలంటే మనం తీసుకొనే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అలాగే వేడి నీటితో స్నానం చేయడం మానేసి చల్లటి నీటితోనే స్నానం అలవాటు చేసుకోవాలి. ఫ్యాటీ ఫిష్‌ తింటే ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు డాండ్రఫ్‌ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్‌ జుట్టు మందంగా ఉంచేందుకు, పెరుగుదలకు సాయపడతాయి. జింక్, బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే డాండ్రఫ్‌ను రాకుండా అడ్డుకోవచ్చు. మోనో అన్‌శాచురేటెడ్‌ కొవ్వు ఆమ్లాలు జుట్టుకు మేలు చేస్తాయి. ఇందులో పోషకాలు ఉండటం వల్ల జుట్టును సంరక్షిస్తాయి. ఇలాంటి ఆహారాన్ని మన డైట్‌లో చేర్చడం వల్ల చుండ్రును తేలిగ్గా నివారించవచ్చు.

also read news: 

Ys Jagan Govt: సంక్షేమ సారధికి జీతాల సెగలు.. ఏమిటీ దుర్గతి? ఎందుకీ పరిస్థితి?

-Advertisement-

Shriya Saran Latest hot Photoshoot Instagram pics 2022

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News