Friday, May 10, 2024
Homeandhra pradeshWeather Today : తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు కురిసే ప్రాంతాలివే.. ఈ రోజు వాతావరణం.. (26-04-2023)

Weather Today : తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు కురిసే ప్రాంతాలివే.. ఈ రోజు వాతావరణం.. (26-04-2023)

Telugu Flash News

Weather Today : తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వేడికి కాస్త ఉపశమనం ఇస్తూ అకాల వర్షాలు కురుస్తున్నాయి. గాలిలో ద్రోణి, గాలిలో అనిశ్చితి కారణంగా పశ్చిమ విదర్భలోని ఆవర్తనం.. కర్ణాటకపై ప్రభావం చూపనుందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

దిగువస్థాయిలోని గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణపైకి విస్తున్నాయని అధికారులు తెలిపారు. రానున్న ఐదు రోజులపాటు తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువ నమోదయ్యే చాన్స్‌ ఉంది.

ఈ రోజు నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిచే అవకాశం ఉంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే చాన్స్‌ ఉంది.

ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రేపటికి కూడా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. మరోవైపు హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే వీలుంది.

ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మూడు రోజులుగా కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. నేడు రాయలసీమ జిల్లాలైన అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య​, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ రాత్రి సమయంలో వర్షాలు పడే అవకాశం ఉంది.

also read :

-Advertisement-

Gopichand: గోపిచంద్‌తో గొడ‌వ‌కు దిగిన తేజ‌.. నువ్వు ఏం పీకావ్ అంటూ ఫైర్

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News