HomeweatherWeather Report : మళ్లీ భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్..!

Weather Report : మళ్లీ భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్..!

Telugu Flash News

Weather Report : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ప్రకటించింది. రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలోనూ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.

బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనం ఫలితంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, నల్గొండ, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర మరియు కోస్తాంధ్ర జిల్లాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News