Thursday, May 9, 2024
Homeviral newsViral Video Today : ట్రాఫిక్‌ కష్టాలు.. మెట్రోలో పెళ్లి మండపానికి వెళ్లిన వధువు..!

Viral Video Today : ట్రాఫిక్‌ కష్టాలు.. మెట్రోలో పెళ్లి మండపానికి వెళ్లిన వధువు..!

Telugu Flash News

Viral Video Today : ఇటీవల పెళ్లిళ్లు చేసుకొనే జంటలు రకరకాల పద్ధతులతో నెట్టింట వార్తల్లో నిలుస్తున్నారు. ప్రీ వెడ్డింగ్‌ షూట్లతో కొందరు వైరల్‌గా మారుతుంటే.. మరికొందరు నడి రోడ్డుపై పెళ్లి డ్రెస్‌లతో పోజులిస్తూ వీడియోలు, ఫొటో షూట్‌లు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు ఇన్‌స్టా గ్రామ్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఓ పెళ్లి కూతురు వీడియో వైరల్‌గా మారింది.

పెళ్లి వేడుక కోసం అందంగా ముస్తాబైంది ఈ పెళ్లికూతురు. వివాహ సమయం ఆసన్నం కావడంతో కల్యాణ మండపానికి కారులో బయల్దేరింది. అయితే, మధ్యలో విపరీతమైన ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది పెళ్లి కూతురు వెళ్తున్న కారు. దీంతో పెళ్లి కూతురికి ఒక ఐడియా వచ్చింది. పక్కనే మెట్రో స్టేషన్‌ వద్ద కారులోంచి దిగేసింది. వెంటనే మెట్రో ఎక్కి కల్యాణమండపానికి చేరుకుంది.

మెట్రో స్టేషన్‌కు చేరుకోగానే అందరూ ఈమెను చూడటం మొదలు పెట్టారు. ఇదేంటి పెళ్లి కూతురు గెటప్‌లో వచ్చిందంటూ ఆసక్తిగా గమనించారు. పెళ్లి మండపానికి సమయం అవుతోందని, అందుకే ఇలా రావాల్సి వచ్చిందని అందరికీ పెళ్లి కూతురు చెబుతూ మెట్రో రైల్లో వెళ్లింది. దీన్ని వీడియో తీసిన కొందరు సోషల్‌ మీడియాలో పెట్టారు. గంటల్లోనే ఇది వైరల్‌గా మారిపోయింది. బెంగళూరు నగరంలో ఈ ఉదంతం వెలుగుచూసింది.

స్మార్ట్‌ పెళ్లి కూతురు..

సాధారణంగా బెంగళూరులో భారీ ట్రాఫిక్‌ ఉంటుంది. రద్దీ నియంత్రణకు పోలీసులు, ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం అంతంతమాత్రంగానే ఉంటోంది. రోడ్లపైకి వచ్చే వాహనాలు భారీగా పెరుగుతుండడమే ఇందుకు కారణం. ప్రజా రవాణా వ్యవస్థలను అందరూ ఉపయోగించుకుంటే ట్రాఫిక్‌ తగ్గుతుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లి కూతురు వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ట్రాఫిక్‌ కష్టాల నుంచి తప్పించుకొనేందుకు యువతి సమయస్పర్తి ప్రదర్శించిందని కితాబిస్తున్నారు. వావ్‌.. స్మార్ట్‌ పెళ్లి కూతురు.. అంటూ మెచ్చుకుంటున్నారు.

also read :

-Advertisement-

G.O. No.1 News : జీవో నంబర్‌ 1 పై పట్టు వదలని వైసీపీ సర్కార్‌.. సుప్రీంకోర్టులో నేడు విచారణ

BRS meeting in Khammam : బీఆర్‌ఎస్‌ సభ విజయవంతమైందా? లక్ష్యం దిశగా కేసీఆర్ అడుగులు పడ్డాయా?

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News