HometelanganaBRS meeting in Khammam : బీఆర్‌ఎస్‌ సభ విజయవంతమైందా? లక్ష్యం దిశగా కేసీఆర్ అడుగులు పడ్డాయా?

BRS meeting in Khammam : బీఆర్‌ఎస్‌ సభ విజయవంతమైందా? లక్ష్యం దిశగా కేసీఆర్ అడుగులు పడ్డాయా?

Telugu Flash News

BRS meeting in Khammam : వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికార పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తొలి అడుగు పడిందా? ఖమ్మంలో లక్షలాది మంది జనం, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలతో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైందా?  ఈ ప్రశ్నలకు జవాబు దొరకాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ ఏడాదే తెలంగాణలో సాధారణ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ జాతీయ పార్టీగా రూపాంతరం చేసి దేశ వ్యాప్తంగా బీజేపీని ఢీకొట్టాలని పథక రచన చేస్తున్నారు.

ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు కేసీఆర్‌. ఈ సభకు స్వయంగా ఆయనే అధ్యక్షత వహించారు. లక్షలాదిగా తరలి వచ్చిన గులాబీ శ్రేణులతో ఖమ్మం తళతళ మెరిసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తోపాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా తదితర జాతీయ నేతలు సైతం బీఆర్ఎస్‌ భారీ సభకు హాజరయ్యారు.

2024 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందన్న కేసీఆర్‌.. మోదీ ఇంటికి వెళ్తారని.. మనం ఢిల్లీలో కూర్చుంటామని వ్యాఖ్యానించారు. బీజేపీని గద్దె దించడానికి అందరూ ఏకం కావాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలు, కన్నీళ్ల నుంచి భారత జాతి విముక్తి కోసమే భారత రాష్ట్ర సమితిని స్థాపించామని కేసీర్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తెస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలోనే దేశంలో ప్రతి ఇంటికీ రక్షిత నీరు, సాగుకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని కేసీఆర్‌ మాట ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటి వరకు దేశానికి ఒక లక్ష్యమంటూ లేదని, ఇది సిగ్గుపడాల్సిన అంశమన్నారు కేసీఆర్. దేశంలో లక్షల కోట్ల సంపద ఉందని, ఎవరినీ అడగాల్సిన పని లేదని చెప్పారు కేసీఆర్‌. దేశంలో ప్రబలమైన మార్పు తెస్తామంటున్న కేసీఆర్‌.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళిక ఉంటుందో తర్వాత వివరంగా చెబుతామని సభ సాక్షిగా తెలిపారు. జనసమీకరణలో విజయవంతమయ్యారు కేసీఆర్‌. అయితే, తెలంగాణలో ఉన్న జోరు దేశ వ్యాప్తంగా రావాలంటే అది చాలా కష్టతరమైన అంశమనే విశ్లేషణలు వస్తున్నాయి. మరి కేసీఆర్‌ ఎలాంటి ఫార్ములా ఉపయోగిస్తారో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

also read :

Sruthi Hassan: ఆ డైరెక్ట‌ర్‌తో శృతి హాస‌న్ ప్రేమ‌లో ఉందా.. క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు

-Advertisement-

Samantha Latest beautiful Photos from Shaakuntalam movie

Immunity Foods : రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలా.. ఈ ఫుడ్స్‌ తింటే తిరుగుండదు!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News