Homeandhra pradeshG.O. No.1 News : జీవో నంబర్‌ 1 పై పట్టు వదలని వైసీపీ సర్కార్‌.. సుప్రీంకోర్టులో నేడు విచారణ

G.O. No.1 News : జీవో నంబర్‌ 1 పై పట్టు వదలని వైసీపీ సర్కార్‌.. సుప్రీంకోర్టులో నేడు విచారణ

Telugu Flash News

ఏపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్‌ 1 (G.O. No.1) పై రాజకీయ కాక రేగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కందుకూరులో నిర్వహించిన బహిరంగసభలో ఏకంగా 8 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. తర్వాత గుంటూరు నగరంలోనూ తొక్కిసలాట జరిగి ముగ్గురు మృత్యువాత పడ్డారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై విరుచుకుపడింది. సభల పేరిట జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మంత్రులు, ఎమ్మెల్యేలు సహా నేతలంతా మండిపడ్డారు. ఈ క్రమంలోనే సభలు, ర్యాలీలపై ఆక్షలు విధిస్తూ జీవో నంబర్‌ 1ను విడుదల చేసింది ప్రభుత్వం.

దీనిపై అటు టీడీపీతో పాటు అనేక పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేసేందుకే ఇలాంటి జీవో తెచ్చిందని విమర్శించాయి. దీనిపై చంద్రబాబు స్పందించి సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తన సభలకు భారీగా జనసందోహం వస్తుండడంతో ఓర్వలేక జగన్‌ ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నాడని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌ పని అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లో జగన్‌ పరాజయం తప్పదని చంద్రబాబు జోస్యం చెప్పారు.

సంక్రాంతి వేడుకల సందర్భంగా సొంతూరు నారావారిపల్లెకు వెళ్లిన చంద్రబాబు.. జీవో నంబర్‌ 1 ప్రతులను భోగి మంటల్లో వేసి మరీ జగన్‌పై మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో జీవో నంబర్‌ 1ను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. విచారణ జరిపిన ధర్మాసనం.. ఆ జీవోను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసిందంటూ నేతలు వ్యాఖ్యానించారు.

నేడు విచారణ.. ఏ నిర్ణయం వెలువడుతుందో!

ఈ అంశంపై వైసీపీ సర్కార్‌ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే జీవోను కొట్టివేయడంపై సుప్రీంకోర్టు మెట్లెక్కింది జగన్‌ ప్రభుత్వం. వాస్తవానికి జీవో నంబర్‌ 1ను హైకోర్టు ఈనెల 23వ తేదీ వరకు సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 20వ తేదీ లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే, కౌంటర్‌ దాఖలు చేయకుండానే సుప్రీంకోర్టుకు వెళ్లింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరపనుంది. దీనిపై అత్యున్నత ధర్మాసనం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది.

also read:

BRS meeting in Khammam : బీఆర్‌ఎస్‌ సభ విజయవంతమైందా? లక్ష్యం దిశగా కేసీఆర్ అడుగులు పడ్డాయా?

-Advertisement-

Sruthi Hassan: ఆ డైరెక్ట‌ర్‌తో శృతి హాస‌న్ ప్రేమ‌లో ఉందా.. క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News