Thursday, May 9, 2024
Homeviral newsViral Video : ఫూటుగా తాగి మండపంలోనే నిద్రపోయిన పెళ్లికొడుకు..

Viral Video : ఫూటుగా తాగి మండపంలోనే నిద్రపోయిన పెళ్లికొడుకు..

Telugu Flash News

Viral Video : మద్యం తాగే అలవాటు చాలా మంది యువతకు ఉంటుంది. అయితే, కుటుంబ కార్యక్రమాల్లోనూ, శుభకార్యాల సమయాల్లో, ఫంక్షన్లలో కూడా మద్యం సేవిస్తే ఆ ప్రభావం జీవితాంతం ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనలు కోకొల్లలు జరుగుతుంటాయి. ఇక పెళ్లి చేసుకొనే సమయాల్లో కూడా కొందరు పెళ్లికుమారులు మద్యం సేవించి.. పెళ్లి ఆగిపోయేలా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వరుడు ఫూటుగా మద్యం సేవించి ఏకంగా పెళ్లి మండపంలోనే నిద్రపోయాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందో చూడండి..

పెళ్లి అంటే నూరేళ్ల పంటగా చెబుతారు. పెళ్లి పీటలు, వివాహ వేదికను సాక్షాత్తూ దైవ స్వరూపంగా భావిస్తారు. అత్యంత పవిత్రంగా జీవితంలో గుర్తుండిపోయే ఘటనగా వివాహాన్ని వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే, పెళ్లి పీటలపైనే వివాహ తంతు ఆగిపోతే.. ఇక జీవితాంతం ఇలాంటి ఘటనలు మరువలేరు. ఇక ఈ ఘటనలో కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఫుల్లుగా మద్యం సేవించిన వరుడు.. వివాహ వేదికపైనే నిద్రపోయాడు. దీంతో ఇంతటి నిర్లక్ష్యం వహించే వ్యక్తిని ఆ వధువు మరోమాట లేకుండా పెళ్లి చేసుకొనేందుకు నిరాకరించింది.

విస్తుపోయే ఈ ఘటన అస్సాంలో చోట చేసుకుంది. నల్బరీ జిల్లాలో వరుడు అతిగా మద్యం సేవించి కళ్యాణ మండపానికి చేరుకున్నాడు. అప్పటికే లిమిట్‌ దాటేసిన అతగాడు.. కనీసం నిలబడేందుకు, కూర్చొనేందుకు కూడా నానా పాట్లు పడుతున్నాడు. ఈ దుస్థితిలో అక్కడ పెళ్లి పీటలపై పంతులు చెప్పే మంత్రాలను కూడా పలకలేక అవస్థలు పడ్డాడు. అనంతరం కాసేపటికే కూర్చున్న ప్రదేశంలోనే నేలపై పడుకుండిపోయాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

పెళ్లి కుమారుడితో పాటు వరుడి తండ్రి, కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా మద్యం సేవించి ఉన్నారు. దీంతో వధువు, ఆమె కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తెలియలేదు. ఈ నేపథ్యంలోనే పెళ్లి కుమార్తె ఈ పెళ్లి చేసుకొనేందుకు నిరాకరించింది. వధువు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దను సంప్రదించిన పెళ్లి రద్దు చేసుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు కనీసం కారులో నుంచి కూడా దిగలేకపోయాడని, అతడి తీరు కారణంగా పెళ్లి రద్దయినందుకు నష్టపరిహారం చెల్లించాలని వధువు తరఫు వారు డిమాండ్‌ చేశారు. ఈ దృశ్యాన్ని పెళ్లికి వచ్చిన కొందరు వీడియో తీశారు. ఇప్పుడు ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

also read :

MLA Rajaiah : రాజయ్య వేధింపుల వ్యవహారంలో ట్విస్ట్‌.. దంపతులతో కలిసి రాజయ్య ప్రెస్‌మీట్‌!

-Advertisement-

NTR: ఎన్టీఆర్ కోసం ప్రాణాలైన తీస్తానంటూ క‌మెడీయ‌న్ సంచ‌ల‌న కామెంట్స్

Shriya Saran You And I Magazine Photoshoot Photos 2023

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News