HomeinternationalPour Moi Survey : భారత మహిళలు.. ప్రపంచంలో అత్యంత అందగత్తెలు!

Pour Moi Survey : భారత మహిళలు.. ప్రపంచంలో అత్యంత అందగత్తెలు!

Telugu Flash News

Pour Moi Survey : ప్రతి సంవత్సరం ప్రపంచ సుందరి, విశ్వసుందరి పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఏదో ఒక దేశానికి చెందిన మగువ అందులో విజేతగా నిలుస్తుంటారు. అయితే, ఇలా ఒక్కరికే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్‌ బ్యూటిఫుల్‌ మహిళలు ఎవరనే దానిపై తాజాగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో ఓ సంస్థ అధ్యయనం చేసింది.

ఇందులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత అందమైన మహిళలు భారతీయులేనని ఆ నివేదిక పేర్కొంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన మల్టీ నేషనల్‌ క్లాత్‌ కంపెనీ పోర్ మోయి .. ఆన్‌లైన్‌లో ఈ అధ్యయనం నిర్వహించింది.

కృత్రిమ మేధస్సు సాయంతో చేసిన ఈ అధ్యయనంలో.. ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం రెడ్డిట్‌లో గతేడాది కాలంలో మహిళలు, పురుషుల అందానికి సంబంధించి వచ్చిన లక్షలాది పోస్టులను పోర్ మోయి సంస్థ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో విశ్లేషణ చేసింది.

పలు దేశాలకు చెందిన మహిళలు, పురుషులతో కూడిన పోస్టులు ఇందులో ఉన్నాయి. వాటిలో అట్రాక్టివ్‌, బ్యూటిఫుల్, హ్యాండ్‌సమ్, ప్రెట్టీ, గుడ్‌ లుకింగ్, గార్జియస్, ప్రెట్టీ..వంటి కామెంట్లు ఉన్నాయి. ఈ పోస్టులు, ఫొటోలకు వచ్చిన ఓట్లను సంస్థ పరిణగణనలోకి తీసుకుంది. అంటే ఫేస్‌బుక్‌లో లైక్స్‌, కామెంట్ల మాదిరిగా అన్న మాట.

ఇలా చేసిన అధ్యయనంలో వివిధ దేశాల వారికి అందులో ర్యాంకులను ఇచ్చింది సదరు సంస్థ. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఇమేజ్‌ జనరేషన్‌ టూల్‌ అయిన మిడ్‌జర్నీ సహాయంతో 50 దేశాల మహిళలు, పురుషులకు చెందిన రూపురేఖలపై తయారు చేసిన ఫొటోలను కూడా విడుదల చేసింది.

ఈ పోర్ మోయి సంస్థ అధ్యయనంలో ప్రపంచంలోనే అత్యంత అందమైన వారిగా భారతీయ మగువలు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జాబితాలో తర్వాతి స్థానాల్లో వరుసగా.. జపాన్, స్వీడన్‌, పోలాండ్, ఇటలీ, బ్రెజిల్, ఉక్రెయిన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా మహిళలు ఉన్నారు.

-Advertisement-

మహిళలు, పురుషులు కలిపి అత్యంత అందగాళ్లుగా భారతీయులే ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా అమెరికా, స్వీడన్, జపాన్, కెనడా, బ్రెజిల్ వాసులు ఉన్నారు. మరోవైపు మన పొరుగుదేశాలైన చైనా 16వ స్థానంలోనూ, పాకిస్తాన్ 23 స్థానంలో నిలవడం గమనార్హం.

ఇక పురుషుల కేటగిరీలో బ్రిటిషోళ్లు వరల్డ్‌వైడ్‌ అత్యంత ఆకర్షణీయమైన వారిగా ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచారు. వారి తర్వాతి స్థానంలో ఇండియన్‌ మెన్‌ ఉన్నారు. ఇక ఇందులో తర్వాతి స్థానాల్లో వరుసగా ఇటలీ, యూఎస్‌ఏ, స్వీడన్, జపాన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, బెల్జియం, బ్రెజిల్‌ వారు ఉన్నారు. మొత్తానికి భారతీయులే అత్యంత అందమైన వ్యక్తులుగా ఈ సంస్థ అధ్యయనంలో తేల్చింది.

also read :

Viral Video : ఫూటుగా తాగి మండపంలోనే నిద్రపోయిన పెళ్లికొడుకు..

MLA Rajaiah : రాజయ్య వేధింపుల వ్యవహారంలో ట్విస్ట్‌.. దంపతులతో కలిసి రాజయ్య ప్రెస్‌మీట్‌!

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News