HomecinemaNTR: ఎన్టీఆర్ కోసం ప్రాణాలైన తీస్తానంటూ క‌మెడీయ‌న్ సంచ‌ల‌న కామెంట్స్

NTR: ఎన్టీఆర్ కోసం ప్రాణాలైన తీస్తానంటూ క‌మెడీయ‌న్ సంచ‌ల‌న కామెంట్స్

Telugu Flash News

NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న తాత న‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఆన‌తి కాలంలోనే అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. అత‌నికి ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. వారిలో క‌మెడీయ‌న్ ర‌ఘు కూడా ఒక‌రు.

పక్కా తెలంగాణ యాస, భాషల్లో దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించి అలరించిన క‌మెడీయ‌న్ ర‌ఘు తాజాగా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కాలేజ్ డేస్‌ నుండి రౌడీయిజం చేసేవాడినని చెప్పుకొచ్చిన రఘు.. తన మిత్రుడైన ఎన్టీఆర్ జోలికొస్తే చంపడానికైనా చావడానికైనా రెడీ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

పలానా వాడు ఇలా అన్నాడని ఎన్టీఆర్ నాతో చెప్తే.. రేపటికల్లా ఆ ప్రాణం ఉండదు. అందులో ఎలాంటి మొహమాటం అయితే లేదు. ఎన్టీఆర్ జోలికి ఎవరు వచ్చినా ప్రాణం తీసేస్తా.

నాకు ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం. ఆయన కోసం చావడానికైనా.. చంపడానికైనా కూడా సిద్ధమే. ఎన్టీఆర్ త‌న తాతకి తగ్గ మనవడు.. ఆయన వస్తేనే టీడీపీకి పూర్వవైభవం వ‌స్తుంది. భవిష్యత్‌లో ఆయన ఖచ్చితంగా సీఎం అవుతారు అంటూ ర‌ఘు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

also read :

-Advertisement-

Beetroot juice : రోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే అందం మరింత పెరగడం తథ్యం!

Health Tips (08-03-2023) : ఈ 9 ఆరోగ్య చిట్కాలు పాటించి చూడండి..

10 Health Benefits of Sweet Potatoes You Need to Know

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News