Thursday, May 9, 2024
Homeviral newsViral Video: చీరకట్టులో డాన్స్‌ ఇరగదీసింది.. ఫిదా అయిపోతున్న నెటిజన్లు!

Viral Video: చీరకట్టులో డాన్స్‌ ఇరగదీసింది.. ఫిదా అయిపోతున్న నెటిజన్లు!

Telugu Flash News

Viral Video : సోషల్‌ మీడియాలో రోజుకు ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ప్రస్తుతం వీడియోల ట్రెండ్‌ నడుస్తోంది. చాలా మంది తమకు నచ్చిన పాటలకు డ్యాన్స్‌ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇవి నెటజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఓ యువతి చీరకట్టులో చేసిన డ్యాన్స్‌ నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఎంత ముద్దుగా డ్యాన్స్‌ చేసిందో మీరే చూడండి..

ఓ యువతి చీర కట్టి డాన్స్‌ చేసింది. పాత కాలం హిందీ చిత్రంలోని పాట చోలీ కే పీచే క్యా హై అనే బాలీవుడ్‌ హిట్‌ సాంగ్‌కు ఆ యువతి నృత్యం చేసింది. దీంతో అక్కడున్న వారేగాక నెటిజన్లు కూడా అదుర్స్‌ అంటున్నారు. యువతి డ్యాన్స్‌ చేసిన తీరు, ఆమె ట్యాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు. అదరగొట్టే స్టెప్పులు, సూపర్బ్‌, మెస్మరైజింగ్‌, మైండ్‌ బ్లోయింగ్‌ అంటూ ఆ యువతిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

1993లో యాక్షన్ డ్రామా చిత్రంగా ఖల్ నాయక్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని చోలీ కే పీచే క్యా హై సాంగ్ నేటికీ వన్నె తగ్గలేదు. ఈ పాటను అల్కా యాగ్నిక్, అరుణ్ పాడగా.. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ స్వరాలు సమకూర్చారు. ఆనంద్ భక్షి గీత రచయిత. ఈ పాట నాటికీ, నేటికీ సెన్సేషనే. ఈ పాటనే ఆ యువతి ఎంపిక చేసుకొని డాన్స్‌ చేసింది. ఆమె పేరు కనికా గోపాల్.

ఫేర్ వెల్ లో భాగంగా స్టేజ్ పై ఈ పాటకు ఆమె డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చింది. పాటకు అనుగుణంగా స్టెప్పులు వేసింది. స్టెప్పులతో, కిల్లింగ్ లుక్స్ తో, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఈ ముద్దుగుమ్మ చెలరేగింది. ఇంకేముందీ.. కనికా గోపాల్ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. కనికా ఈ వీడియోను ఏప్రిల్ 3న తన ఇన్ స్టా గ్రామ్‌ ఖాతాలో పంచుకుంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 10లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వ్యూస్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇక లక్షల సంఖ్యలో కామెంట్లు, లైకులు వెల్లువెత్తుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Kanika (@_kanikagopal)

Read Also : Sadha: అందాల స‌దా క‌న్నీళ్లు పెట్టుకుందేంటి.. కార‌ణ‌మేమంటే..!

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News