Thursday, May 9, 2024
HometelanganaCar Accident : అమెరికాలో కారు బోల్తా.. తెలంగాణ విద్యార్థి దుర్మ‌ర‌ణం

Car Accident : అమెరికాలో కారు బోల్తా.. తెలంగాణ విద్యార్థి దుర్మ‌ర‌ణం

Telugu Flash News

తెలంగాణ(telangana)కు చెందిన ఓ విద్యార్థి అమెరికా (America) లో జరిగిన కారు ప్రమాదం (Car Accident)లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బోయ మహేష్(boya mahesh) (24) మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కప్పెట గ్రామానికి చెందినవాడు. వివరాలలోకి వెళ్తే .. బోయ శకుంతల, వెంకట్ రాములు కుమారుడు మహేష్ బీటెక్ పూర్తి చేసి.. 4 నెలల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ కాంకోర్డియా యూనివర్సిటీ (concordia university) లో ఎంఎస్ చేస్తున్నాడు.

ఆ రోజు రాత్రి తన ముగ్గురు స్నేహితులు భరత్‌, శివ, శ్రీలక్ష్మి కలిసి లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లాడు. ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న ఆ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

కొడుకు మరణవార్తతో విలపిస్తున్న మహేష్ తండ్రి బోయ వెంకట్ రాములు మహారాష్ట్రలోని ఓ కాంట్రాక్టర్ వద్ద సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మహేష్ డెడ్ బాడీని ఇండియాకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

read more :

Tiger Nageswara Rao First Look : ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ విడుదల.. రవితేజ లుక్ అదిరిపోయిందిగా!

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News