HomecinemaTiger Nageswara Rao First Look : 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ విడుదల.. రవితేజ లుక్ అదిరిపోయిందిగా!

Tiger Nageswara Rao First Look : ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ విడుదల.. రవితేజ లుక్ అదిరిపోయిందిగా!

Telugu Flash News

Tiger Nageswara Rao First Look : రవితేజ (raviteja) హీరోగా యంగ్ డైరెక్టర్ వంశీ (vamshi) దర్శకత్వం వహించిన , నూపుర్ సనన్(nupur sanon), గాయత్రి భరద్వాజ్ (gayatri bharadwaj) కథానాయికలుగా నటిస్తున్నభారీ పాన్-ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ చిత్రానికి అభిషేక్ పిక్చర్స్ (abhishek Pictures) పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను కొద్దిసేపటి క్రితం రాజమండ్రి హేవ్ లాక్ బ్రిడ్జిపై గ్రాండ్‌గా విడుదల చేయగా, పలువురు స్టార్ హీరోలు తెలుగుతో పాటు పలు భాషల్లో డిజిటల్‌గా విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌లో విక్టరీ వెంకటేష్ వాయిస్‌తో పాటు తెలుగులో ఫస్ట్ లుక్‌ని విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. 1970లలో టైగర్ జోన్ గా పేరు తెచ్చుకున్న స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ చాలా బాగుంది. ఈ పవర్ ఫుల్ లుక్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా, ఈ చిత్రం అక్టోబర్ 20న చాలా భాషల్లో విడుదల అవుతుంది .

read more news :

Pavitra-Naresh Love Story : త‌మ ల‌వ్ స్టోరీ గుట్టు విప్పిన న‌రేష్‌..

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News