HomecinemaRajamouli: అమెరికాలో ఇల్లు తీసుకున్న రాజ‌మౌళి.. ఎందుకో తెలిస్తే అవాక్క‌వుతారు..!

Rajamouli: అమెరికాలో ఇల్లు తీసుకున్న రాజ‌మౌళి.. ఎందుకో తెలిస్తే అవాక్క‌వుతారు..!

Telugu Flash News

Rajamouli: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌కి ఆస్కార్ ద‌క్క‌డంతో ఇప్పుడు రాజ‌మౌళి పేరు మారుమ్రోగిపోతుంది. ప్ర‌పంచంలోని టాప్ మోస్ట్ డైరెక్ట‌ర్స్ లో ఆయ‌న ఒక‌రు అని చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అప‌జ‌యం కూడా లేని రాజ‌మౌళికి బాహుబ‌లి సినిమాతో విప‌రీత‌మైన క్రేజ్ ద‌క్కింది. ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు ఒళ్లు పులకరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు 12 మూవీస్ తీస్తే అవన్నీ కూడా ఇండస్ట్రీ రూపురేఖల్ని పూర్తిగా మార్చేశాయి.

అయితే ఇన్నాళ్లు తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు ఇండియా వైడ్ ప్రేక్షకుల్ని అలరించిన రాజమౌళి దృష్టి ఇప్పుడు హాలీవుడ్ పై పడింది. అందులో భాగంగానే లాస్ ఏంజెల్స్ లో ఓ అద్దె ఇల్లు తీసుకున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆస్కార్ నామినేషన్స్, అవార్డు అందుకోవడంలో భాగంగా అమెరికాకు చాలాసార్లు వెళ్లి వచ్చిన రాజమౌళి.. పలు హాలీవుడ్ నిర్మాణ సంస్థలతోనూ ప‌లు ద‌ఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మ‌హేష్‌- రాజ‌మౌళి సినిమా భారీ ఎత్తున తెర‌కెక్క‌నుండ‌గా, ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి పనిచేయనున్నాడు. అయితే అక్క‌డికి వెళ్లిన ప్ర‌తీసారి హోట‌ల్‌లో ఉండాలంటే చాలా అవుతుంది కాబ‌ట్టి అక్క‌డ ఓ రెంటెడ్ హౌస్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

also read :

Africa splitting : ఆఫ్రికా రెండు ముక్కలవుతుందా? కొత్త ఖండం ఆవిర్భావం ఖాయమా?

భార్యపై ఫిర్యాదు చేసిన భర్త.. పోలీసులకే దిమ్మ తిరిగింది!

Meena: ఆ హీరో అంటే క్ర‌ష్ అన్న మీనా.. ఆయ‌న పెళ్లి రోజు గుండె బ‌ద్ద‌లైందంటూ కామెంట్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News