HomesportsPv Sindhu: చీర‌క‌ట్టులో త‌న డ్యాన్స్‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టిన పీవీ సింధు..

Pv Sindhu: చీర‌క‌ట్టులో త‌న డ్యాన్స్‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టిన పీవీ సింధు..

Telugu Flash News

Pv Sindhu: రెండు సార్లు ఒలంపిక్ ప‌తకం సాధించిన పీవీ సింధు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. అప్పుడ‌ప్పుడు ట్రెండీ దుస్తుల‌లో ఫొటో షూట్ చేసి వాటికి సంబంధించిన పిక్స్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ప‌లు సూప‌ర్ హిట్ సాంగ్స్‌కి కూడా డ్యాన్స్‌లు చేస్తూ మెస్మ‌రైజ్ చేస్తుంటుంది.షటిల్ బ్యాట్‌తో కోర్టులో ప్రత్యర్ధికి చెమటలు పట్టించే పీవీ సింధు హ్యాపీ మూడ్‌లో హిట్ సాంగ్‌కి స్టెప్పులు వేయడం హాబీగా మార్చుకుంది. గతంలో కచ్చా బాదమ్, అరబిక్ కుతు వంటి సాంగ్స్‌కి డ్యాన్స్ వేసి అద‌ర‌గొట్టిన సింధు తాజాగా జిగిల్ జిగిల్ అనే హిట్‌ సాంగ్‌కు చీరకట్టుకొని మరీ స్టెప్పులు వేసి అంద‌రిని అల‌రించింది. సింధు డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

అద‌ర‌గొట్టేసింది..

సింధు డ్యాన్స్‌పై నెటిజ‌న్స్ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం నెగ్గిన తర్వాత పెద్ద టోర్నీల్లో తెలుగు తేజం పీవీ సింధు ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుంది. ఇక ఈ ఏడాది జరిగిన సూపర్ 300 కేటగిరీ టోర్నీలు అయిన స్విస్ ఓపెన్, సయ్యద్ మోడి లను మాత్రమే సింధు సాధించింది. అలానే సూపర్ 500 టైటిల్ ను అందుకుంది. సింగపూర్ ఓపెన్ లో చాంపియన్ గా అవతరించింది. అయితే సింధు గ్రౌండ్‌లోనే కాదు సోష‌ల్ మీడియాలోను ర‌చ్చ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే చూపిస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పీవీ సింధు తన లేటేస్ట్ డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేయ‌గా, గంటల వ్యవధిలోనే ఈ వీడియోని మూడున్నర లక్షల మంది చూశారంటే పీవీ సింధు డ్యాన్స్ తో పాటు ఆమెకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. పీవీ సింధుకు డ్యాన్స్ చేయడం కొత్తేమి కాకపోయినా క‌న‌కాంబ‌రం రంగు క‌ల‌ర్ శారీలో స్టెప్పులు వేయడం కాస్త కొత్తగానే ఉంది. అందుకే వీడియో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sindhu Pv (@pvsindhu1)

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News