HomecinemaAdipurush : ఆదిపురుష్‌పై మంచు విష్ణు అంత మాట అన్నాడా.. నిజమేంటి ?

Adipurush : ఆదిపురుష్‌పై మంచు విష్ణు అంత మాట అన్నాడా.. నిజమేంటి ?

Telugu Flash News

Adipurush: మంచువార‌బ్బాయి మంచు విష్ణు ఇటీవ‌ల తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా అత‌డిపై న‌డుస్తున్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఏదో ఒక విష‌యంలో మంచు విష్ణు పేరు తీస్తూ తెగ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే ఆదిపురుష్‌పై మంచు విష్ణు దారుణ‌మైన కామెంట్స్ చేశాడ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతుండగా, దీనిపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. వివ‌రాల‌లోకి వెళితే మంచు విష్ణు..ఆదిపురుష్ చిత్రం గురించి మాట్లాడుతూ.. లైవ్ యాక్షన్ చిత్రంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారని.. ఇది మెయిన్ స్ట్రీమ్ లైవ్ యాక్షన్ సినిమా అవుతుందని అనుకున్నాము. కాని ఇది యానిమేష‌న్ సినిమాలా ఉంటుంద‌ని ఊహించ‌లేదు అని ఆయ‌న కామెంట్స్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది.

క్లారిటీ ఇచ్చిన విష్ణు

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి రామాయణం వస్తుందని.. అందులోనూ తాన్హాజీ డైరెక్టర్ దీన్ని తెరకెక్కిస్తున్నారంటే ఈ సినిమాపై ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నాం. కాని యానిమేటెడ్ వీడియోను రిలీజ్ చేస్తే ఇలాంటి స్పందనలే వస్తాయి అంటూ మంచు విష్ణు చెప్పినట్లుగా అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేసాయి. ఈ క్ర‌మంలో మంచు విష్ణు త‌న ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. మంచు విష్ణు ఈ వ్యాఖ్యలు అన్నట్టు చేసిన ఓ పోస్టర్ ని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ”ఇదంతా ఫేక్‌ న్యూస్‌. నేను ఊహించినట్టే జరుగుతుంది. ‘జిన్నా’ సినిమా రిలీజ్‌కి ముందు కొందరు ఐటెమ్‌ రాజాలు కావాలనే ఇలాంటి నెగటివ్‌ వార్తలను ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌భాస్‌కి మంచి జ‌ర‌గాల‌ని నేను కూడా కోరుకుంటున్నా అంటూ విష్ణు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆదిపురుష్ విష‌యానికి వ‌స్తే రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రాన్ని 3డీ చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా … బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. భారీ బడ్జెట్‍తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News