HometelanganaNaveen Murder Case : ట్రయాంగిల్‌ ప్రేమ కథలో సంచలన విషయాలు.. యువతి ఫోన్లో కీలక అంశాలు!

Naveen Murder Case : ట్రయాంగిల్‌ ప్రేమ కథలో సంచలన విషయాలు.. యువతి ఫోన్లో కీలక అంశాలు!

Telugu Flash News

Naveen Murder Case : హైదరాబాద్‌ అబ్దుల్లాపూర్‌ మెట్‌లో యువకుడు నవీన్‌ అత్యంత దారుణంగా స్నేహితుడి చేతిలో హత్యకు గురైన ఉదంతం నగరవాసులను భయభ్రాంతులకు గురి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో పోలీసులు ఒక్కో నిజాన్ని వెలికి తీస్తున్నారు.

తన ప్రియురాలికి దగ్గరవుతున్నాడనే అక్కసుతో నవీన్‌ అనే యువకుడిని హరిహరకృష్ణ అనే యువకుడు హతమార్చాడు. పార్టీ అని చెప్పి పిలిపించి అత్యంత దారుణంగా హత్య చేశాడు.

తర్వాత నవీన్‌ శరీర భాగాలను కోసేసి వాటిని ఫొటోలు తీశాడు. తన ప్రియురాలికి పంపి పైశాచికానందం పొందాడు హరిహరకృష్ణ. క్రైమ్‌ థ్రిల్లర్‌, వెబ్‌ సిరీస్‌లలో చూసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

తాజాగా ముగ్గురి మధ్య జరిగిన ట్రయాంగిల్‌ టవ్‌ ట్రాక్‌లో అమ్మాయి ప్రమేయం కూడా హత్యకు పురిగొల్పిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమ్మాయి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని పరిశీలించగా వారికి దిమ్మతిరిగే విషయాలు తెలిసినట్లు సమాచారం.

ప్రియురాలి ఫోన్‌ కాల్స్‌, డేటా, మెసేజ్‌లు చూసిన పోలీసులు విస్తుపోయే విషయాలను గుర్తించారు. ఆ యువతి ఒకే సమయంలో ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపిందని నిర్ధారించారు.

హరితో ఆ అమ్మాయి ఉన్న సమయంలో అనేక సార్లు నవీన్‌ ఫోన్‌ చేశాడని, ఇది గమనించి.. ఎక్కడ తన ప్రియురాలు తనకు దక్కకుండా దూరమవుతుందోనని భావించి నవీన్‌ను హరిహరకృష్ణ హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. అమ్మాయిని విచారణ చేస్తేమరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

-Advertisement-

మరోవైపు విచారణ సందర్భంగా ఇప్పటికే మూడుసార్లు హరిహర గర్ల్‌ఫ్రెండ్‌ను పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులకే ఆ అమ్మాయి చుక్కలు చూపిస్తోందని సమాచారం.

విచారణకు అసలు సహకరించడం లేదని, ఈ కేసులో తనను ఇరికించాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసులను బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆమెకు సఖి కేంద్రంలో కౌన్సెలింగ్‌ కూడా ఇప్పించారు.

అయినప్పటికీ ఆమె తీరులో మార్పు రాలేదని తెలుస్తోంది. మరోవైపు ఈ హత్య కేసులో నిందితుడైన హరిహరకృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మొత్తానికి కేసు విచారణ ట్విస్టుల మధ్య కొనసాగుతోంది.

also read :

Naveen Murder Case : నవీన్‌ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం.. హరిహరకృష్ణ ఏమేం చేశాడంటే..

Samantha: ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే స‌మంత అన్ని కోట్లు సంపాదిస్తుందా..!

Priya Prakash Varrier Latest Images, Photo gallery 2023

Sreemukhi: లక్కీ శ్రీముఖి.. సీనియ‌ర్ స్టార్స్ చిత్రాల‌లో క్రేజీ రోల్స్

rakul preet singh Latest instagram photos, pics, Images 2023

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News