HomecinemaSreemukhi: లక్కీ శ్రీముఖి.. సీనియ‌ర్ స్టార్స్ చిత్రాల‌లో క్రేజీ రోల్స్

Sreemukhi: లక్కీ శ్రీముఖి.. సీనియ‌ర్ స్టార్స్ చిత్రాల‌లో క్రేజీ రోల్స్

Telugu Flash News

Sreemukhi: బుల్లితెర యాంక‌ర్‌గా స‌త్తా చాటుతున్న అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. ఈ అమ్మ‌డు ఒక‌వైపు బుల్లితెర‌పై సంద‌డి చేస్తూనే అడ‌పాద‌డ‌పా వెండితెర‌పై కూడా వినోదం పంచే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది.

గతంలో జులాయ్, నేను శైలజ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ నటిగా మెరుపులు మెరిపించిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా మాస్ట్రో మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్ లో క‌నిపించి అల‌రించింది. అయితే సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల శ్రీముఖి చేసే ర‌చ్చ పీక్స్ లో ఉంటుంది. ఆమె గ్లామ‌ర్ షోకి బెంబెలెత్తిపోతున్నారు.

ప్ర‌స్తుతం శ్రీముఖి చిరంజీవి భోళా శంకర్ సినిమాలో.. ముఖ్యమై పాత్రను పోషిస్తుంద‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇందులో ఆమె పాత్ర‌కు సంబంధించి జోరుగా ప్ర‌చారాలు అయితే సాగాయి. ఇక ఈ అమ్మ‌డు మ‌రో క్రేజీ ఆఫ‌ర్ అందుకున్న‌ద‌ని తెలుస్తుంది.

న‌టసింహం నందమూరి బాలకృష్ణ 108 మూవీలో శ్రీముఖి ఎంపికైన‌ట్టు తెలుస్తోంది. ఈసినిమాలో ఆమె ఓ ముఖ్యమైన పాత్రను పోషించనుంద‌ని, నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ లో ఆమె జాయిన్ కాబోతున్నట్టు అంటున్నారు. శ్రీలీల‌కి ఫ్రెండ్ క్యారెక్ట‌ర్ లో శ్రీముఖి క‌నిపించ‌నుంద‌ని టాక్. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

also read :

Kiara Advani Latest Photos in Yellow Dress

-Advertisement-

drinking tea : ఉదయాన్నే పరగడుపున టీ తాగొచ్చా? లాభమా? నష్టమా?

Pradakshina : దేవతలను బట్టి ఎన్ని ప్రదక్షిణాలు చెయ్యాలో తెలుసా ?

moral stories in telugu : ఇద్దరు స్నేహితులు.. కథ చదవండి..

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News