Homehealthతల్లిపాలు ఇచ్చేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

తల్లిపాలు ఇచ్చేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

Telugu Flash News

తల్లిపాలు ఇచ్చేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. తల్లీ, శిశువూ శుభ్రంగా ఉండాలి.
  2. పాలిచ్చే ముందు తల్లి తన రొమ్ములను (చనుమొనలను), చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
  3. తల్లి ధరించే బ్రా, బ్లౌస్ శుభ్రంగా ఉండాలి.
  4. పాలిచ్చే ముందు బిడ్డ కన్ను, ముక్కునుంచి వెలువడే స్రావాలను శుభ్రంగా తుడవాలి.
  5. తల్లి చేతిగోళ్ళు ఎప్పటికప్పుడు కత్తిరించుకుని శుభ్రంగా ఉంచుకోవాలి.
  6. ప్రసవం కష్టతరమైందని భావించి సిజేరియన్ చేసిన పక్షంలో,  సిజేరియన్ జరిగిన తర్వాత నాలుగు గంటలలోపు తల్లిపాలు పట్టవచ్చు.
  7. తల్లిపాలు ఇచ్చేటప్పుడు హడావిడిగా కాకుండా సౌకర్యంగా, ప్రశాంతంగా కూర్చొని, కొంచెం ముందుకు వంగి శిశువును పొత్తిళ్ళలో నిలువుగా తీసుకొని, తలను కొంచెం వెనక్కు వంచి, తల్లి తన చూపుడువేలు, మధ్యవేలు మధ్యలో రొమ్మును ఉంచి, రొమ్మును కాస్త వెనక్కు జరిపి చనుమొనను శిశువు నోటికి జాగ్రత్తగా అందించాలి.breastfeeding tips
  8. పాలిచ్చే సమయంలో శిశువును నిద్రపోనివ్వకూడదు.
  9.  శిశువు పాలు త్రాగే సమయంలో బలవంతంగా రొమ్మును శిశువు నోటి నుంచి లాగకూడదు.
  10. పాలిచ్చిన తరువాత తల్లి తన చనుమొనను శుభ్రంగా కడుక్కోవాలి. పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి.
  11. బిడ్డను తల్లి ఒడిలో ఉంచుకొని జాగ్రత్తగా బిడ్డ నోటిలో రొమ్ముమొనను ఉంచి పాలు చీకేట్లు చేయాలి.
  12. బిడ్డ తల్లి రొమ్ము చీకేటప్పుడు లేదా పాలు తాగేటప్పుడు బిడ్డ ముక్కు రంధ్రాలు మూసుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  13. బిడ్డ ఎప్పుడు పడితే అప్పుడు ఆకలిగొన్నప్పుడు తల్లిపాలు పట్టాలి. ఒక్కొక్క రొమ్ముకు కనీసం రెండు లేక మూడు నిమిషాలు కేటాయించాలి.
  14. మూడవ రోజు నుంచి మూడు గంటలకొకసారి పాలు పట్టాలి. ఇక్కడ ఒక్కొక్క రొమ్ము నుంచి పది నిముషాలు మించి పట్టకూడదు.
  15. పుట్టినప్పటి నుంచి ఒక నెల రోజుల వరకు రోజుకు ఆరు నుంచి ఎనిమిది సార్లు చొప్పున, మొదటి నెల నుంచి మూడవ నెల వరకు ఐదు నుండి ఆరుసార్లు చొప్పున, నాలుగు నుంచి ఆరు నెలల వరకు నాలుగు నుండి ఐదుసార్లు చొప్పున, ఏడు నుంచి పన్నెండు నెలల వరకు రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు పట్టాలి. మధ్యలో శిశువు ఆకలితో ఉంటే ఎప్పుడయినా పట్టవచ్చు.

మరిన్ని వార్తలు చదవండి :

కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా..ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటించండి..!

Cold Remedies: జలుబు తగ్గడానికి ఏం చేయాలి? ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటించండి..!

Vitamin Poisoning : అధిక మొత్తంలో విటమిన్లు తీసుకుంటే కలిగే నష్టాలు ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News