Sunday, May 5, 2024
HomehealthCervical cancer : స్త్రీలలో వచ్చే సెర్వికల్ క్యాన్సర్ ముప్పు తప్పించుకోవాలంటే…

Cervical cancer : స్త్రీలలో వచ్చే సెర్వికల్ క్యాన్సర్ ముప్పు తప్పించుకోవాలంటే…

Telugu Flash News

Cervical cancer : క్యాన్సర్ అనే మాట ఎవరి జీవితంలో అయినా పెను మార్పులు తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆడవారికి వచ్చే చాలా క్యాన్సర్లు రాకుండా ముందుగానే  జాగ్రత్త పడచ్చు. మనదేశంలో ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్లలో  మొదటిది Cervical cacinoma. తెలుగులో చెప్పాలి అంటే  గర్భాశయ ముఖద్వార క్యాన్సర్.

గర్భసంచి pear పండు ఆకారంలో ఉంటుంది. అంటే, పైన వెడల్పు గా, కింద ఇరుకుగా ఉంటుంది. ఈ కింద ఇరుకుగా, సన్నగా ఉండే చోట సెర్విక్స్ ఉంటుంది అన్నమాట. ఆ cervix ఏ గర్భసంచి కి ద్వారం. ఒక తలుపులాగా అన్నమాట. అక్కడినుండే వీర్యకణాలు లోపలకు వెళ్ళేది, అక్కడినుండే ప్రసవం అయ్యేది, అక్కడినుండే నెల నెలా బ్లీడింగ్ అవుతుంది. అంత ఎక్కువ వాడుక ఉంది కాబట్టే, దానికే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.

సాధారణంగా ఈ క్యాన్సర్ కి ఇది కారణం అని  చెప్పలేని పరిస్థితి. అయితే ఈ క్యాన్సర్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది.

కారణాలు (causes of cervical cancer in females)

  1. HPV వైరల్ ఇన్ఫెక్షన్. ( ఇది రాకుండా vaccine వేసుకోవచ్చు )
  2. అసలు పిల్లలే లేని వాళ్ళు
  3. ఎక్కువమంది పిల్లలు ఉన్నవాళ్లు ( అప్పట్లో పది కాన్పుల దాకా అయ్యేవి గా )
  4. ఎక్కువమంది తో శారీరక సంబంధం ఉన్నవాళ్లు.
  5. HIV లాంటి సమస్యలు ఉన్నవాళ్లు
  6. కొన్ని రకాల జన్యువుల కలయిక అయినా వస్తుంది
  7. వంశపారంపర్యంగా అయితే మాత్రం వచ్చే అవకాశం కాస్త తక్కువ. ( రొమ్ము క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ మాత్రం వంశపారంపర్యంగా వస్తాయి )

లక్షణాలు (early signs of cervical cancer in females)

  1. బరువు తగ్గడం
  2. ఆకలి తగ్గడం
  3. తెల్ల బట్ట, రక్తం కలిసి రావటం
  4. తెల్ల బట్ట లో వాసన ఉండటం
  5. క్యాన్సర్ ముదిరే కొద్దీ మలం మూత్రం కూడా కష్టమే అవుతాయి

ట్రీట్మెంట్ ( cervical cancer treatment)

  1. సర్జరీ
  2. కీమో థెరపీ
  3. రేడియేషన్

Cervical cancer రాకుండా ఏం చేయాలి

1.పైన కారణాలు లో చెప్పినవి ఏవీ లేకుండా చూసుకోవాలి

2.ప్రతీ సంవత్సరం PAP smear పరీక్ష చేసుకోవాలి

  1. HPV vaccine వేసుకోవాలి

ఈ cancer కి ఒక వ్యాక్సిన్ ఉంది. మనదేశంలో దొరుకుతుంది కూడా.. ఒకరోజు ముందు చెబితే, మీ దగ్గర్లో gynaecologist తెప్పించి పెడతారు. అక్కడ వేసుకోవచ్చు.

-Advertisement-

ఇది 9 నుండి 13 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలకు వేయాలి. ఇవి రెండు డోసులలో వేయాలి. ఆరు నెలల తేడాతో చేతికి, లేదా నడుముకి వేసుకోవచ్చు.

వయసు దాటిపోతే, శృంగార జీవితం మొదలు కాకముందు వేసుకోవడం మంచిది. ఒకసారి శృంగార జీవితం మొదలు అయితే, ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రభావం తగ్గుతుంది. కానీ అసలు వేసుకోకపోవడం కన్నా, ఆలస్యంగా వేసుకున్నా పర్లేదు కదా. కాబట్టి, పెళ్ళైన ఆడవాళ్లు, ప్రసవం అయ్యాక అయినా పర్లేదు, రెండు డోసులు వేసుకోండి. ఒక 50% అన్నా రక్షణ ఉంటుంది..

మీ ఆడపిల్లలకు మాత్రం ఖచ్చితంగా వేయించండి..

Dr.Neeharika
Mbbs, Ms
Gynecologist
తిరుపతి

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News