Sunday, May 12, 2024
HomehoroscopeHoroscope Today Telugu (23-03-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు

Horoscope Today Telugu (23-03-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 23rd March 2024: Check astrological prediction for your zodiac signs

Aries | మేష రాశి ఫలాలు 23-03-2024

ఈ రాశి వారు ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు ఎంత‌గానో లభిస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ పనులన్నీ సంతృప్తిక‌రంగానే ఉంటాయి.

Taurus | వృషభ రాశి ఫలాలు 23-03-2024

ఈ రాశి వారు లక్ష్యాల మీద దృష్టి పెట్టడం మంచిది. కొందరు బంధుమిత్రుల ఒత్తిడికి లొంగకుండా ఉండండి. ఆరోగ్యంలో కొద్దిగా మెరుగుదల కనిపిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో సహచరులు మీ బాధ్యతలను పంచుకోవ‌డంతో సంతోషంగా ఉంటారు.

Gemini | మిథున రాశి ఫలాలు 23-03-2024

ఈ రాశి వారు విహార యాత్ర‌ల‌లో జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా ఎదుగుదల కనిపించ‌దు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపించే అవ‌కాశం ఉంది.. విద్యార్థులు విజయాలు సాధించే అవకాశం ఎక్కువ‌.

Cancer | కర్కాటక రాశి ఫలాలు 23-03-2024

ఈ రాశి వారు ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. ఇరుగుపొరుగు వారితో కొద్దిగా చికాకులు క‌నిపిస్తాయి. పిల్లలతో కొద్దిగా సమస్యలు, కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం బాగాలేక‌పోవ‌డం కాస్తంత ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారం సాఫీగా సాగిపోతుంది.

Leo | సింహ రాశి ఫలాలు 23-03-2024

ఈ రాశి వారు విలాసాల కారణంగా ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. కొన్ని ముఖ్యమైన పనులు పెండింగ్లో పడతాయి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు తప్పనిసరిగా ఆచితూచి వ్యవహరించ‌డం మంచిది. బంధుమిత్రులతో అపార్ధాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువ‌గా ఉంది.

-Advertisement-

Virgo | కన్యా రాశి ఫలాలు 23-03-2024

ఈ రాశి వారి వ్యాపారం సజావుగానే సాగిపోతాయి. కుటుంబ పరిస్థితి అన్ని విధాలా ప్రశాంతంగానే ఉంటుంది. బంధువుల్లో కొందరు మీ మీద చెడు ప్రచారం సాగించే సూచనలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.. కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు శరీరంలో కొద్దిపాటి నలత వల్ల ఆగిపోయే ఛాన్స్ ఉంది.

Libra | తులా రాశి ఫలాలు 23-03-2024

ఈ రాశి వారు ఉద్యోగంలో మార్పు జరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవ‌కాశం ఎక్కువ‌.. స్నేహితుల సహా యంతో కొన్ని వ్యక్తిగత పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వాగ్దానాలు చేయటం, హామీలు ఉండటం ప్రస్తుత పరిస్థితుల్లో అంత శ్రేయస్కరం కాదు.

Scorpio | వృశ్చిక రాశి ఫలాలు 23-03-2024

ఈ రాశి వారికి సన్నిహితుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు చేతికి అందే ఛాన్స్ ఉంది. ముఖ్యమైన పనుల్లో కొంత టెన్షన్లు ఉంటాయి. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా లక్ష్యాలను పూర్తి చేసే అవ‌కాశం కూడా ఉంది.

Sagittarius | ధనుస్సు రాశి ఫలాలు 23-03-2024

ఈ రాశి వారు బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు.

Capricorn | మకర రాశి ఫలాలు 23-03-2024

ఈ రాశి వారు రావలసిన డబ్బు సకాలంలో చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఎవరికీ హామీలు ఇవ్వొద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో వాగ్దానాలు చేయటం అస‌లు మంచిది కాదు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైన ఉంది.

Aquarius | కుంభ రాశి ఫలాలు 23-03-2024

ఈ రాశి వారు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగానే సాగిపోతుంది. కుటుంబ పరంగా మాత్రం కొద్దిగా ఇబ్బందులు త‌లెత్తుతాయి.. ముఖ్యమైన నిర్ణయా లలో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించడం ఉత్త‌మం. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

Pisces | మీన రాశి ఫలాలు 23-03-2024

ఈ రాశి వారు ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలు ఎక్కువ‌గా ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. వృత్తి నిపుణులకు కొత్త ఆఫర్లు అందే ఛాన్స్ ఉంది.. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడే అవ‌కాశం ఎక్కువ‌.

also read :

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Mahabharatham story in telugu : మహాభారతం.. పరమాద్భుత రమ్యరసార్ణవ గ్రంథరాజం..

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News