Sunday, May 12, 2024
HomehoroscopeHoroscope Today Telugu (22-03-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు

Horoscope Today Telugu (22-03-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 22nd March 2024: Check astrological prediction for your zodiac signs

Aries | మేష రాశి ఫలాలు 22-03-2024

మేష రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఈ రాశి వారు ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగములో ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు. స్త్రీలకు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వ‌హించ‌డం మంచిది.

Taurus | వృషభ రాశి ఫలాలు 22-03-2024

వృషభ రాశి వారు ఆరోగ్యం విష‌యంలో, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగ, వ్యాపారములయందు కలసి వచ్చును. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగానే ఉంటుంది. బృహస్పతి అనుకూలం ప్రభావంచేత ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి మీ శ్రమతో ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ‌తారు

Gemini | మిథున రాశి ఫలాలు 22-03-2024

మిథున రాశి వారికి రాజకీయ ఒత్తిళ్ళు, సమస్యలు ఏర్పడును. ఈ రాశి వారికి చికాకులు, ఇబ్బందులు ఏర్పడును. శారీరక శ్రమ పెరుగును. కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం ఉత్త‌మం. సమస్యలను, ఒత్తిళ్ళను ఎంతో నేర్పుతో అధిగమించెదరు.

Cancer | కర్కాటక రాశి ఫలాలు 22-03-2024

కర్కాటక రాశి వారు ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ధనమును ఖర్చు చేసెదరు. ఈ రోజు మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితం ల‌భిస్తుంది. మీకు అన్ని విధాలుగా ఈ రోజు కలిసి వచ్చును. కుటుంబ విషయాలయందు జాగ్రత్తలు వహించడం ఉత్త‌మం.

Leo | సింహ రాశి ఫలాలు 22-03-2024

సింహరాశి వారికి ఈ వారం రోజు మీకు మధ్యస్థముగా ఉంటుంది.. సింహరాశి వారు మీ సమస్యలను నేర్పుతో అధిగమించెదరు. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు లాభము, వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగుతుంది.

-Advertisement-

Virgo | కన్యా రాశి ఫలాలు 22-03-2024

కన్యారాశి వారికి ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు ఎంతో అనుకూలించును. చేసే ప్రతీ పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు, దైవదర్శనములు ఎంతో అనుకూలించును. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది.

Libra | తులా రాశి ఫలాలు 22-03-2024

తులారాశి వారికి పనియందు చికాకులు, సమస్యలు ఏర్పడును. ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించ‌డం ఉత్త‌మం. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు, కుటుంబమునందు ఏదో ఒక సమస్య బాధిస్తుంది.. వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు అధికమవుతాయి. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాలి.

Scorpio | వృశ్చిక రాశి ఫలాలు 22-03-2024

వృశ్చిక రాశి వారు చేసే ప్రతీ పనియందు విజయాన్ని పొందెదరు. కుటుంబముతో ఆహ్లాదముగా గడిపెదరు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని స‌కాలంలో పూర్తి చేసెదరు. శుభ ఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకం పఠించడం ఉత్త‌మం.

Sagittarius | ధనుస్సు రాశి ఫలాలు 22-03-2024

ధనూ రాశి వారు ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. ఆర్ధిక సమస్యలు, పనుల యందు ఆలస్యము ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండటం మంచిది.

Capricorn | మకర రాశి ఫలాలు 22-03-2024

మకర రాశి వారికి ఖర్చులు అధికమగును. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు వహించాలి. ఇది ఆచితూచి వ్యవహరించవలసినటువంటి సమయం. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. మకర రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించాలి.

Aquarius | కుంభ రాశి ఫలాలు 22-03-2024

కుంభ రాశి వారికి ఈ రోజు ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగెదరు. ఏలినాటి శని వలన చేసే ప్రతీ పనియందు కొంత ఆటంకములు ఏర్పడుతాయి. చేసే ప్ర‌తి ప‌నిలో కొంత ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

Pisces | మీన రాశి ఫలాలు 22-03-2024

మీన రాశి వారికి ఆర్ధిక లాభములు వ్యాపార లాభము కలుగును. ఉద్యోగస్తులకు కలసివచ్చే సమయం.ఈ రాశి వారు మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. మిగతా గ్రహముల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేసెదరు.

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News