Horoscope Today, 14th april 2023: Check astrological prediction for your zodiac signs
మేష రాశి :
ఈ రాశి వారికి చేసే ప్రతీ పని అనుకూలించును. వ్యయస్థానమునందు గురుని ప్రభావంచేత ఖర్చులు అధికముగా ఉంటాయి. ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి.. స్త్రీలు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించడం మంచిది.
వృషభ రాశి :
వృషభ రాశి వారు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ఒత్తిళ్ళు, వేదనలు అధికముగా ఉంటాయి. వృషభరాశి వ్యాపారస్తులకు ఈ రోజు ఎంతో అనుకూలించును. స్త్రీలకు మానసిక వేదన, ఆరోగ్య సమస్యలు అధికముగా ఉంటాయి. వృషభరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని ఆరాధించాలి.
మిథున రాశి :
మిథున రాశి వారికి కుటుంబమునందు వివాదములు, అనారోగ్య సమస్యలు వేధించును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో మానసిక ఆందోళనలు వేదనలు అధికముగా ఉంటాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి.
కర్కాటక రాశి :
ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధించును. నూతనముగా వస్తువులను కొనడానికి ప్రయత్నించెదరు. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఏర్పడుతాయి. చేసే ప్రతి పనియందు జాగ్రత్త వహించాలి.
సింహ రాశి :
ఈ రాశి వారు కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగ వ్యాపారాలయందు అనుకూల ఫలితములు అధికముగా కనబడుచున్నవి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు. వివాదాలకు కాస్త దూరంగా ఉండడం ఉత్తమం.
కన్య రాశి :
ఈ రాశి వారికి చేసే ప్రతీ పని అనుకూలించును. సమాజంలో కీర్తి కలుగుతుంది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేసేదరు. ధన సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. ప్రయాణములు, దైవదర్శనములు అనుకూలిస్తాయి.. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం ఉత్తమం.
తులా రాశి :
ఈ రాశి వారికి కుటుంబము నందు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. వీరికి కొన్నిసార్లు చికాకులు, ఒత్తిళ్ళు ఏర్పడును. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు కలుగుతుంది.. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సౌఖ్యము. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది.
వృశ్చిక రాశి :
ఈ రాశి వారికి పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వృశ్చికరాశివారు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. వివాదములకు దూరంగా ఉండడం మంచిది . ముఖ్యమైన పనులు విజయవంతముగా పూర్తి చేసెదరు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉ న్నప్పటికి అనుకున్న పని సకాలంలో పూర్తి చేస్తారు.
ధనుస్సు రాశి :
ఈ రాశి వారికి ప్రయాణములు అనుకూలించును. వ్యాపారస్తలకు లాభములు, ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు అనుకూలత కలుగుతుంది. ధనూరాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది. ఇంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి.
మకర రాశి :
ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు , మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మకర రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలని సూచన. వీరికి రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మకర రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించడం మంచిది.
కుంభ రాశి :
కుంభ రాశి వారికి ధనపరమైన సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు, వేదనలు అధికముగా ఉండును ఆర్ధిక సమస్యలు ఏర్పడుతాయి. ఈ రాశి వారికి కుటుంబ వ్యవహారాలు యందు మధ్యస్థ ఫలితాలు కలుగును. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగుతారు.
మీన రాశి :
మీన రాశి వారికి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ధనపరమైనటువంటి వ్యవహారాలయందు జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించడం మంచిది.
also read :
Supreme Court : అమరావతిలో పేదల ఇళ్ల స్థలాల కేసులో ట్విస్ట్.. పిటిషన్ ఉపసంహరణ
MLC Kavitha : సుఖేష్‌తో ఎలాంటి సంబంధాలు లేవు.. ఇదంతా కుట్రేనన్న ఎమ్మెల్సీ కవిత
Vizag Steel : వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిన కేంద్రం.. క్రెడిట్ కోసం నేతల పాకులాట
Mahesh-Rajamouli : బాబోయ్.. మూడు పార్ట్‌లుగా మహేష్-రాజమౌళి మూవీ..!
Mango : మామిడి పండ్లు తినేముందు ఇలా చేస్తే బోలెడు ఉపయోగాలు
NTR: ఎన్టీఆర్ మిడ్ నైట్ పార్టీ.. రామ్ చరణ్ డుమ్మా కొట్టడానికి కారణం ఏంటి?