HomenewsMango : మామిడి పండ్లు తినేముందు ఇలా చేస్తే బోలెడు ఉపయోగాలు

Mango : మామిడి పండ్లు తినేముందు ఇలా చేస్తే బోలెడు ఉపయోగాలు

Telugu Flash News

వేసవి కాలంలో మామిడిపండ్లు (mango) తినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎంతగానో వీటికోసం ఎదురు చూస్తుంటారు. మామిడి పండ్లను తినే ముందు వాటిని నీటిలో నానబెట్టాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఇలా ఎందుకు నానబెడతారో చాలా మందికి తెలియదు. పూర్వ కాలం నుంచి మామిడి పండ్లను నానబెట్టే ఆచారం వస్తోందని చెబుతున్నారు.

మామిడి కాయలను తినే ముందు వాటిని కనీసం ఓ గంట సమయం నీటిలో నానబెట్టాలని పెద్దలు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మామిడి పండ్లలో ఉత్పత్తయ్యే అదనపు ఫైటిక్‌ ఆమ్లాలు తొలగిపోతాయని స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా కూరగాయలు, ధాన్యాలు, పప్పులు వంటి వాటిలోనూ ఫైటిక్‌ యాసిడ్‌ ఉంటుంది. నీటిలో నానబెట్టడం వల్ల విచ్ఛిన్నం అయిపోతుందని చెబుతారు.

ఫైటిక్ యాసిడ్లు అదనపు వేడిని ఉత్పత్తి చేస్తాయని, నానబెట్టడం వల్ల ఆ వేడి తగ్గిపోతుందని చెబుతున్నారు. మామిడిపండ్లను నీటిలో నానబెట్టడం వల్ల పండ్ల తొక్కపై ఉండే ఆయిల్‌ తొలగిపోతుంది. అది ఉంటే కొందరికి ఎలర్జీ వచ్చే ఆస్కారం ఉందట.

నీటిలో నానబెట్టడం వల్ల మామిడిపండు రుచి కూడా పెరుగుతుందని పెద్దలు చెబుతున్నారు. వేసవిలో వచ్చే రోగాల బారి నుంచి రక్షించుకోవడానికి మామిడిపండును తినాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందంటున్నారు.

also read :

Dry Fruits Health Benefits : పోషకాలకు నిలయం డ్రై ఫ్రూట్స్ 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News