Friday, May 10, 2024
Homeandhra pradeshVizag Steel : వైజాగ్ స్టీల్‌ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిన కేంద్రం.. క్రెడిట్ కోసం నేతల పాకులాట

Vizag Steel : వైజాగ్ స్టీల్‌ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిన కేంద్రం.. క్రెడిట్ కోసం నేతల పాకులాట

Telugu Flash News

Vizag Steel : విశాఖపట్నం స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించే అంశంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే అంశంపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయాలని తాము భావించడం లేదని చెప్పారు.

విశాఖపట్నంలోని పోర్టు కళావాణి స్టేడియంలో రోజ్ గార్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కులస్తే మాట్లాడుతూ.. ఇప్పటికిప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రవేటీకరణ చేయాలనుకోవడం లేదన్నారు. 
విశాఖ ఉక్కుపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు.

దానికంటే ముందుగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యామన్నారు. స్టీల్ ప్లాంటులోని కొన్ని విభాగాలను ప్రారంభిస్తున్నామన్నారు. ముడిసరుకు పెంపొందించేందు కార్యాచరణపై ఫోకస్ చేసినట్లు వివరించారు. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంటు పని చేసే కార్యాచరణ జరుగుతోందని చెప్పారు.

vizag steel plantదీనిపై ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చలు జరపనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి వెల్లడించారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ అధికారులతో సమావేశం కానున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌లో పాల్గొనడం అనేది రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. ఇక స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై చాలా కాలంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి.

ఈ క్రమంలోనే బీజేపీ తప్ప అన్ని పార్టీలూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నాయి. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే, తాజాగా కేంద్రం వెనక్కి తగ్గడంపై అటు తెలంగాణలో, ఇటు ఏపీలో రాజకీక కాక మొదలైంది. విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరణ చేయనివ్వబోమని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు.

బిడ్డింగ్‌లో తాము పాల్గొంటామని ప్రకటన చేశారు. ఈ మేరకు సింగరేణి అధికారులు కూడా స్టీల్ ప్లాంటును సందర్శించారు. అయితే, ఇప్పుడు కేంద్రం వెనక్కి తగ్గడానికి కారణం కేసీఆర్ అంటే భయపడి మాత్రమేనంటూ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.

-Advertisement-

హరీష్ రావుకు కేసీఆర్ అంటే గిట్టదని, మామ మీద కోపం తమ మీద చూపిస్తుంటారని సెటైర్లు వేశారు. కేసీఆర్‌ను చూసి కేంద్రం వెనక్కి తగ్గి ఉంటే మరి తెలంగాణలో సింగరేణి విషయంలో ఎందుకు వెనక్కి తగ్గలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఇలా క్రెడిట్ కోసం నేతలు ఆరాట పడుతుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

also read :

Mahesh-Rajamouli : బాబోయ్.. మూడు పార్ట్‌లుగా మ‌హేష్‌-రాజ‌మౌళి మూవీ..!

Mango : మామిడి పండ్లు తినేముందు ఇలా చేస్తే బోలెడు ఉపయోగాలు 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News