Sunday, May 19, 2024
Homemoral stories in telugumoral stories in telugu : కలలోని పాములు రాజుకి ఏం చెప్పాయి?

moral stories in telugu : కలలోని పాములు రాజుకి ఏం చెప్పాయి?

Telugu Flash News

moral stories in telugu : ఒక రాజుకి ఉన్నట్టుండి ఒక కొత్త ఆలోచన వచ్చింది, పనీపాటలేని సేవకులు వేలాది మంది ఎందుకు ? తిండి దండగ ! మంత్రాంగం తెలిపే మంత్రులు వందమంది ఉంటే రాజ్యం పటిష్టంగా ఉంటుంది. శత్రువుల ఆట కట్టించవచ్చు. ఎత్తుకి పై ఎత్తు వెయ్యవచ్చు. సాటి రాజులందరికి ఒక్కొక్క మంత్రే ఉన్నాడు. నా ఆలోచనకి తనని తానే అభినందించుకొని నిద్రపోయాడు.

‘ఆ రాజుకి ఒక కల వచ్చింది. వచ్చిన కల కలత పెట్టింది. ఆ కలలో నూరు తలలున్న పాము కనిపించింది. తలా ఒక తల శరీరానికి వేరు వేరు ఆజ్ఞలనిస్తుంది.ఏ ఆజ్ఞ పాటించాలో తెలీక తికమకపడుతుంది. ఒకటి ఏటి కీడిస్తే ఇంకోటి కాటి కీడుస్తుంది. శత్రువు దగ్గర కొస్తుంటే ఒకతల అటుపొమ్మంటే ఇంకో తల ఇటు పొమ్మంటోంది. ఈ లోపల పెద్ద శత్రువు సర్పం శరీరాన్ని కొరికింది. శరీరం తునాతునకలవుతోంది.

ఇంతలో రాజు గారికి దోమ కుట్టి మెలకువ వచ్చింది. దోమని కొట్టి చంపి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. ఈసారి ఇంకో కల వచ్చింది. ఆ కలలో కూడా సర్పం సాక్షాత్కరించింది. కాని ఈ పాముకి ఒక తల నూరు కాళ్ళు ఉన్నాయి, ఉన్న ఒక్క తల చక్కగా పద్ధతిగా ఆజ్ఞలిస్తుంది. వందకాళ్ళు మారు మాట్లాడక ఎదిరించక తు.చ. తప్పక ఆజ్ఞలను అమలు పరుస్తున్నాయి. శత్రువు దగ్గరకు రాగానే ఎటు పారిపోవాలో ఉన్న ఒక్క మెదడు చెప్పింది. వంద కాళ్ళు పాటించాయి.

సర్పం సరసర పాకి పోయి ప్రాణాలు దక్కించుకొంది. రాజుకి మెలుకువ వచ్చింది. మెదడు చురుకుగా పని చేసింది. ఆజ్ఞలు ఇచ్చేవారు ఒకరు ఉంటేనే మంచింది. పాటించేవారు, సేవచేసేవారు అధిక సంఖ్యలో ఉంటే మంచిదని కలలోని పాములు ఇలలోని రాజుకి చెప్పకనే చెప్పాయి.

నీతి : ఆలోచన చెప్పేవారు వందమంది ఉన్నా, ఆదేశాలి చ్చేవాడు ఒకడే ఉండటం శ్రేయస్కరం.

also read :

-Advertisement-

Akira Nandan: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ప‌వ‌న్ కళ్యాణ్ త‌న‌యుడు.. అప్‌డేట్ వ‌చ్చేసింది..!

Viral Video : మరువలేని మమకారం.. నెలరోజుల తర్వాత ఆరిఫ్‌ వెళ్తే జూలో కొంగ ఎంతలా పరితపించిందో చూడండి..

Horoscope (13-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News