Homehealthచలికాలంలో వచ్చే జలుబు మరియు ఫ్లూ నివారణ కోసం ఈ 5 మసాలాలను తీసుకుంటే చాలు

చలికాలంలో వచ్చే జలుబు మరియు ఫ్లూ నివారణ కోసం ఈ 5 మసాలాలను తీసుకుంటే చాలు

Telugu Flash News

చలికాలం వచ్చిందంటే, జలుబు, దగ్గు, గొంతునొప్పి, శ్వాసకోశ సమస్యలు ఇలా ఎన్నోమనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శీతాకాలపు పొడి గాలి మీ శరీరాన్ని ఇటువంటి సమస్యలతో పోరాడలేనంతగా బలహీనం చేస్తుంది. కాబట్టి ఈ కాలంలో రోగనిరోధక శక్తికి శరీరానికి ఎక్కువగా అవసరం కావచ్చు.

అలాగే, ఈ వాతావరణం వలన కొన్ని సమయాల్లో బయట అడుగు పెట్టడం దాదాపు అసాధ్యం కాబట్టి ఈ కాలంలో శరీరానికి శ్రమ తక్కువగా ఉంటుంది. దానివలన అందరూ నాలుగ్గోడల మధ్య ఉండటం వలన వైరస్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి.

ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి, మీ ఆహారంలో సరైన మార్పులు చేయడం చాలా ముఖ్యం. కొన్ని మసాలాలు శీతాకాలపు సూపర్‌ఫుడ్‌లు, మనం ఖచ్చితంగా మన ఆహారంలో ఇవి చేర్చాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఆహారంలో రుచిని కూడా పెంచుతాయి.

ఇక్కడ మేము చెప్పే 5 వస్తువులను మీ ఆహారంలో చేర్చుకోండి:

1. అల్లం

జలుబుకు మంచి చికిత్స ఏదైనా ఉంది అంటే , అందులో ముందుగా చెప్పుకునేది అల్లం గురించే. ఇది జలుబు నుండి తక్షణ ఉపశమనం ఇస్తుంది, అందుకే మీఇటువంటి వాతావరణంలో అల్లం టీ తీసుకోవడం వలన శరీరంలో ఉత్తేజం పెరిగి తాజాగా ఉంటుంది.

ఎలా వాడాలి: తేనె మరియు తాజాగా తురిమిన అల్లం కలిపిన వేడి నీరు కూడా గొంతు నొప్పికి అద్భుతమైన చికిత్స.

-Advertisement-

2. దాల్చిన చెక్క

దాల్చిన చెక్క వాసన ఎవరికైనా మంచి అనుభూతిని కలిగిస్తుంది, అయితే దాల్చినచెక్కలో మంచి వాసన కంటే శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇన్ఫెక్షన్ మరియు ఇన్ఫ్లమేషన్‌తో పోరాడటానికి ఇందులో యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయి, కాబట్టి జలుబు మరియు ఫ్లూ సీజన్‌లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది సరైన మార్గం.

ఎలా తీసుకోవాలి: ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 1/2 టీస్పూన్ దాల్చినచెక్క మరియు తురిమిన అల్లం వేసి తేనెతో కలపండి. దీనిని రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు.

3. మిరియాలు

యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా, ఈ మసాలా జలుబు మరియు ఫ్లూ వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగడమే కాకుండా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు నుండి కూడా రక్షణ లభిస్తుంది.

ఎలా వాడాలి: కప్పు పసుపు పాలలో తాజాగా దంచిన నల్ల మిరియాలు లేదా నల్ల మిరియాల పొడిని వేయండి. ఒకవేళ పాలతో వద్దు అనుకుంటే వీటిని బ్లాక్ టీతో కలపండి ఆ తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పుని పైన చల్లండి.

4. పసుపు

పసుపు ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇది జలుబు మరియు ఫ్లూతో పోరాడటానికి సహాయపడుతుంది, ఇది రోగనిరోధక వ్యవస్థకు కూడా చాలా మంచిది ఇంకా కీళ్ల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

ఎలా వాడాలి: అల్లం-పసుపు మిశ్రమం జలుబుపై అద్భుతమైన చికిత్సగా పనిచేస్తుంది. ఒక కప్పు శుద్ధి చేసిన నీటిని తీసుకుని, ఒక అంగుళం అల్లం, ఒక టీస్పూన్ పసుపు మరియు సగం నిమ్మకాయ కలపండి. ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి ఈ మిశ్రమాన్ని తీసుకోండి.

5. తులసి

తులసి ఆకులను సూక్ష్మజీవుల వ్యాధులను నయం చేయడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి తరచుగా ఉపయోగిస్తారు. ఇది పొడి దగ్గుతో సహా వివిధ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడే యాంటీ బాక్టీరియల్ మరియు అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉండటమే కాకుండా, తులసి ఆకు టీ ఆస్తమాను కూడా నయం చేస్తుంది.

ఎలా వాడాలి: ఒక కప్పు నీటిలో ఐదు లవంగాలు మరియు ఎనిమిది తులసి ఆకులను కలిపి మరిగించాలి. కొద్దిగా ఉప్పు కలిపిన తర్వాత, టీని చల్లార్చాలి. దగ్గు నుండి ఉపశమనం పొందేందుకు రోజూలో ఎక్కువసార్లు త్రాగాలి. గొంతు నొప్పి ఉంటే తులసి కలిపిన నీటితో పుక్కిలించడం మంచిది.

also read news:

ఉదయాన్నే నిమ్మరసం తాగితే ఏమవుతుందో తెలుసా ?

జాన్వీ కపూర్ కు లక్కీ ఛాన్స్.. రామ్ చరణ్ సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News