Friday, May 10, 2024
Homeandhra pradeshYS Avinash Reddy : వివేకా హత్య కేసులో అవినాశ్‌ రెడ్డికి కాస్త ఊరట.. ముందస్తు బెయిల్‌పై కోర్టు ఏమందంటే..

YS Avinash Reddy : వివేకా హత్య కేసులో అవినాశ్‌ రెడ్డికి కాస్త ఊరట.. ముందస్తు బెయిల్‌పై కోర్టు ఏమందంటే..

Telugu Flash News

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి (YS Avinash Reddy) తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు మధ్యాహ్నం విచారణ జరిపిన న్యాయస్థానం.. మంగళవారానికి విచారణ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే దాకా వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని విచారణకు పిలవొద్దంటూ సీబీఐకి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

దీంతో అవినాశ్ రెడ్డికి స్వల్ప ఊరట లభించినట్లయింది. రేపు సాయంత్రం నాలుగు గంటల తర్వాత అవినాశ్‌ రెడ్డిని విచారణ చేసుకోవచ్చని పేర్కొంది. వాస్తవానికి సోమవారం ఉదయం పదిన్నర గంటలకు విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు ఎంపీకి ఇదివరకే నోటీసులిచ్చారు. అయితే, హైకోర్టు ఆదేశాలతో ఆ నోటీసులను రద్దు చేసుకొని మరోసారి సాయంత్రం నాలుగు గంటలకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక వివేకా హత్య కేసులో అవినాశ్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టులో భాస్కర్‌రెడ్డి పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే సీబీఐ అరెస్టు చేసిందని, ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై అవినాశ్‌రెడ్డి తరఫున లాయర్‌ వాదన వినిపించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. సీబీఐ పెట్టే చిత్ర హింసలను భరించలేకే వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌ రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చాడని న్యాయవాది వాదనలు వినిపించారు.

ఈ కేసులో అవినాశ్‌రెడ్డి నిందితుడని ప్రచారం జోరుగా సాగుతోందని, దస్తగిరికి బెయిల్‌ వచ్చిన తర్వాత రోజే సీబీఐ అధికారులు 306 పిటిషన్‌ వేశారని గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగానే దస్తగిరిని సీబీఐ అధికారులు అప్రూవర్‌గా మార్చారని, హత్యకు సంబంధించిన ఆధారాలేవీ లేవన్నారు. హత్య జరిగిన తర్వాత సాక్షాధారాలు తుడిచివేశారని చెబుతున్నారని, ఇది నిజమైతే ఆయన్ను అరెస్టు చేయాల్సిన పని లేదన్నారు.

అన్ని కోణాల్లో విచారణ చేసి ఈ హత్యకు కారకులెవరో తేల్చాల్సిన బాధ్యత సీబీఐదేనని, కానీ ఆ దిశగా దర్యాప్తు జరగడం లేదని అవినాశ్‌ రెడ్డి తరఫు లాయర్‌ వాదించారు. ఈ కేసులో కేవలం రాజకీయ కోణంలోనే విచారణ పర్వం సాగుతోందని, ఇందులో భాగంగానే భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌ రెడ్డిలను ఇరికించే కుట్ర జరుగుతోందని అవినాశ్‌ రెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ తరఫున న్యాయవాది ఎన్నిసార్లు విచారణకు పిలుస్తున్నా ప్రతిసారీ పిటిషన్లు వేసి అడ్డుపడుతున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. ఇప్పటికే అవినాశ్‌ రెడ్డి నాలుగు సార్లు విచారణకు హాజరయ్యారని గుర్తు చేశారు.

Also Read :

-Advertisement-

Surekhavani-RGV: వామ్మో.. సురేఖా వాణి ర‌చ్చ పీక్స్ లో ఉందిగా.. నైట్ పార్టీలో ఆర్జీవీతో..!

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్ అయిన‌ట్టేనా.. అమ్మాయి ఎవ‌రంటే..!

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News