HometelanganaViveka Murder Case : అప్రూవర్‌ దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు.. కౌంటర్‌ వేయాలని ఆదేశాలు

Viveka Murder Case : అప్రూవర్‌ దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు.. కౌంటర్‌ వేయాలని ఆదేశాలు

Telugu Flash News

Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. ఈ కేసులో దస్తగిరిని అప్రూవర్‌గా మార్చవద్దంటూ వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి తరఫు లాయర్లు కోరారు. వీరి వాదనలు విన్న ధర్మాసనం.. కౌంటర్‌ దాఖలు చేయాలంటూ అప్రూవర్‌ దస్తగిరికి తాజాగా నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల మూడో వారానికి ధర్మాసనం వాయిదా వేసింది. ఇక ఈ కేసులో దస్తగిరి వాంగ్మూలం కీలకంగా మారింది.

దస్తగిరి వాంగ్మూలం

వివేకానందరెడ్డి హత్యలో సునీల్‌ యాదవ్‌, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, తాను పాల్గొన్నట్లుగా దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. డబ్బు పరమైన లావాదేవీలతోనే వివేకాను హత్య చేసినట్లు దస్తగిరి పేర్కొన్నాడు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓడిపోయాడని, ఎర్ర గంగిరెడ్డి మోసం చేయడం వల్లే తాను ఓడిపోయానని వివేకాకు ఆగ్రహంగా ఉండేదని చెప్పాడు. బెంగళూరులో ఓ స్థలం విషయమై పంచాయితీకి చాలా సార్లు వివేకానందరెడ్డి వెళ్లారని దస్తగిరి చెప్పాడు. ఆ స్థలంలో తనకూ వాటా కావాలని ఎర్ర గంగిరెడ్డి కోరాడని, దీంతో వివేకా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడని దస్తగిరి చెప్పాడు.

2018లో తాను వివేకానందరెడ్డి వద్ద పని మానేసినట్లు దస్తగిరి పేర్కొన్నాడు. ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌ను తరచూ కలిసేవాడినని చెప్పాడు. 2019 ఫిబ్రవరి 2న తమ ముగ్గురినీ ఎర్ర గంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లాడని, ఈ క్రమంలోనే వివేకానందరెడ్డిని చంపాలంటూ ఎర్ర గంగిరెడ్డి తనకు సూచించాడని పేర్కొన్నాడు. దీంతో తాను వివేకాను చంపలేనని చెప్పడంతో హత్య చేసేందుకు తాము కూడా వస్తామని చెప్పారన్నాడు. ఈ హత్యలో పెద్దల ప్రమేయం ఉందని దస్తగిరి తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. హత్యలో అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శంకర్‌రెడ్డిల పాత్ర ఉందన్నాడు.

శంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడని, అందులో రూ.5 కోట్లు తనకు ఇస్తానని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి పేర్కొన్నాడు. ఇలా నాలుగు రోజుల తర్వాత సునీల్‌ తనకు కోటి రూపాయలు ఇచ్చాడని, రూ.25 లక్షలు తనకు ఇవ్వాలంటూ సునీల్‌ చెప్పాడని దస్తగిరి తెలిపాడు. ఇందులో రూ.75 లక్షలు మున్నా అనే వ్యక్తి వద్ద దాచానన్నాడు. హత్య చేసే క్రమంలో వివేకా పెంపుడు కుక్కను కారుతో ఢీకొట్టి చంపినట్లు తెలిపాడు. మార్చి 14న తాను, సునీల్‌, ఉమాశంకర్‌ కలిసి వివేకా ఇంటికి వెళ్లామన్నాడు.

బెంగళూరు స్థలంలో వాటా ఇవ్వాలని ఎర్ర గంగిరెడ్డి అడగ్గా.. అనంతరం వివాదం చోటు చేసుకుందన్నాడు. వివేకాపై చేయి చేసుకోవడంతో కిందపడిపోయాడని, అనంతరం ఉమాశంకర్‌రెడ్డి గొడ్డలితో దాడి చేసినట్లు దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పాడు. తర్వాత వివేకా చేత్తోనే లెటర్‌ రాయించినట్లు పేర్కొన్నాడు. తర్వాత బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి నరికేశామని, అనంతరం గోడ దూకి పారిపోయినట్లు దస్తగిరి ఆగస్టు 30న ప్రొద్దుటూరులో వాంగ్మూలం ఇచ్చాడు.

also read :

-Advertisement-

Viral Video : పనివాళ్లకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.. యజమాని ఏం చేశాడంటే..!

moral stories in telugu :  నిన్ను నీవు నిందించుకోకు..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News