Sunday, May 19, 2024
HomeweatherWeather Report : విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, వచ్చే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

Weather Report : విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, వచ్చే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

Telugu Flash News

Weather Report : భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేడు, రేపు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా ఎడతెరిపిలేని వానలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లో అత్యధికంగా 18.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా రాజాపేట్‌లో 17.1 సెం.మీ., మెదక్‌ జిల్లా ఎల్దుర్తిలో 14.6 సెం.మీ., కుమ్రంభీం జిల్లా బెజ్జూర్‌లో 14.1 సెం.మీ., వరంగల్‌ జిల్లా పర్వతగిరిలో 13.9 సెం.మీ., సిద్దిపేట జిల్లా తొగులలో 13 సెం.మీ., భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో 11.8 సెం.మీ., కామారెడ్డి జిల్లా గాంధారిలో 11.5 సెం.మీ., సంగారెడ్డి జిల్లా ఆందోలులో 11.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయిలో 9.4 సెం.మీ., మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తిలో 8.4 సెం.మీ., ములుగు జిల్లా వెంకటపురంలో 7.6 సెం.మీ., రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 7.3 సెం.మీ., హైదరాబాద్‌ షేక్‌పేటలో 6.6 సెం.మీ., ఖైరతాబాద్‌లో 4.7 సెం.మీ., మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కూకట్‌పల్లిలో 5.6 సెం.మీ., కుత్బుల్లాపూర్‌లో 4.7 సెం.మీ., సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 4.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సియర్ సూన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని, నైరుతి రుతుపవనాల ద్రోణి కొంతమేర తెలంగాణ వైపు వచ్చాయని వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు.

అల్పపీడన ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆగస్టు మొదటి వారం వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రిజర్వాయర్లు, తక్కువ ఎత్తులో ఉన్న కల్వర్టులు, రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నీటి ఎద్దడిపై అధికారులు నిఘా ఉంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు.

also read :

-Advertisement-

horoscope today july 20 2023 | ఈ రోజు రాశి ఫలాలు 20-07-2023

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

beauty tips in telugu : సౌందర్య చిట్కాలు (19-07-2023)

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News