Monday, May 13, 2024
Homecinemaspecial stories : ఎవరి ఆలోచనలకు అందని సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ(RGV)

special stories : ఎవరి ఆలోచనలకు అందని సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ(RGV)

Telugu Flash News

ఇటీవలే కాలంలో తెలుగు సినిమా ప్రపంచ సినిమాగా మారింది. మన సినిమాలు ఎప్పుడు వస్తాయా అని పక్క రాష్ట్రం నుంచి పక్క దేశం వరకు ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదివరకు తెలుగు సినిమా అంటే ఒక ప్రాంతం సినిమా ఇప్పుడు తెలుగు సినిమా అంటే భారతదేశం సినిమా.

చిన్న దర్శకుడా పెద్ద దర్శకుడా అన్న తేడా లేకుండా మంచి కథలతో వచ్చి హిట్ల పై హిట్లు కొడుతున్నారు మన దర్శకులు. కానీ చాలా మందికి తెలిసినా పట్టించుకోని విషయం ఏంటంటే అసలు తెలుగు సినిమాకి సరైన గుర్తింపు లేని సమయంలోనే అందర్నీ ఆశ్చర్య పరిచే కొత్త తరహా కథలతో హిట్ కొట్టి అందర్నీ అవాక్కయ్యేలా చేసిన ఒకే ఒక్క దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram gopal varma).

సివిల్ ఇంజీనీరింగ్ చేసిన RGV 1989 లో అక్కినేని నాగార్జునతో తీసిన “శివ” సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. అలా తీసిన మొదటి సినిమాతోనే భారీ విజయం సాధించి నంది అవార్డ్ అందుకుని అందర్నీ ఆశ్చర్య పరచడమే కాక ప్రేక్షకుల మనసుల్లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

1991లో విక్టరీ వెంకటేష్ తో క్షణ క్షణం సినిమా తీసి మరో సారి తాను ఈ తెలుగు సినీ పరిశ్రలో ఉండి అలరించడానికే వచ్చానని అందరికి తెలిసేలా చేశారు.

ఆ తరువాత ఇటు గాయం, ప్రేమ కథ, సత్య, రక్త చరిత్ర -1,రక్త చరిత్ర -2 లాంటి తెలుగు సినిమాలతో అటు కంపనీ, భూత్, రంగీలా, సర్కార్, 2008 ముంబై అటాక్స్ లాంటి హిందీ సినిమాలతో తన ప్రత్యేకమైన కథా శైలికి అవధులు లేవని చెప్తూ వరసగా ఒకదాని తరువాత ఒకటి భారీ విజయాల్ని అందుకుని సినిమా అంటే తన సినిమా మత్రమే అని గుర్తుకొచ్చేంతలా అందర్నీ ప్రభావితం చేసారు.

కానీ ఎందుకిలా 

కానీ వరసగా అలాంటి ఆల్ టైం హిట్స్ అందించిన రామ్ గోపాల్ వర్మ తన స్థాయిని తగ్గించుకునేలా, అసలు ఆసక్తి కలిగించని సినిమాలు తీస్తాడని ఎవరూ ఊహించలేదు.

-Advertisement-

మొదట్లో ఎవరికీ అందని ఆశ్చర్య పరిచే కథలతో వచ్చిన RGV మెల్ల మెల్లగా తన స్థాయికి సరిపడని సినిమాలు తీయడం మొదలు పెట్టారు.

ram gopal varmaఐస్ క్రీం -1, ఐస్ క్రీం-2, అనుక్షణం, 365 డేస్ లాంటి బిలో యావరేజ్ సినిమాలతో సినీమాలు తీయాలి కాబట్టి తీస్తున్నట్టుగా తీయడం మొదలు పెట్టారు. ఆఖరికి తనకు మొదటి సినిమాతో భారీ విజయాన్ని ఇచ్చిన హీరో నాగార్జునతో ఇటీవలే తీసిన ఆఫీసర్ తో కూడా ప్రేక్షకులను ఏ మాత్రం మెపించలేక పోయారు. 

RGV ఇక నిర్మాతలు కూడా తనతో సినిమాలు తీయడానికి ముందుకు రాకపోవడంతో తన సొంత నిర్మాణంతో, తన సొంత ఓ.టి.టి ప్లాట్ ఫామ్ లో  సినిమాలు ప్రారంబించారు.

ఆఖరికి ప్రేక్షకుడు చూస్తాడా లేదా అనే విషయం కూడా పట్టించుకోకుండా “A- సర్టిఫికేట్” సినిమాలు, సీరీస్ లు తీయడం మొదలు పెట్టారు. అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు తీసుకున్నారో ఎవరికి అర్థం కాకుండా ప్రవర్తించడం మొదలు పెట్టారు.

ఈయన సినిమాలపై ప్రముఖ హిందీ నటులు పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ “we loved his dramas untill he became the drama” అనగా,నవాజుద్దీన్ సిదికి మాట్లాడుతూ “అప్పట్లో కొత్త వారికి అవకాశం ఇచ్చిన ఒకే ఒక్క దర్శకుడు RGV ఇప్పుడు అలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారో ఆయనకే తెలియాలి” అంటూ వారి వారి అబిప్రాయాలను తెలియచేసారు.

అందర్నీ అవాక్కయ్యేల సినిమాలు తీసిన RGV ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తునాడా అని ఆలోచించే వాళ్ళు కొందరైతే తనకు ఇష్టమైన సినిమాలు తను తీస్తున్నారని వాళ్ళని వ్యతి రేకించే వాళ్ళు ఇంకొంత మంది.

ఏదేమైన RGV మునుపటిలా “శివ” లాంటి సినిమాలు తీస్తే చూడాలని చాలా మంది ఆయన అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

also read news:

8 Ganesh Temples in Maharashtra : అష్టగణపతి క్షేత్రములు 

dandruff : చలికాలంలో చుండ్రు సమస్యలతో సతమతం అవుతున్నారా? పరిష్కార మార్గాలు ఇవే.. 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News