Sunday, May 19, 2024
Homemoral stories in telugumoral stories in telugu :  నిన్ను నీవు నిందించుకోకు..

moral stories in telugu :  నిన్ను నీవు నిందించుకోకు..

Telugu Flash News

moral stories in telugu : వారణాసిలో ఒకవ్యాపారి తన వ్యాపారంలో కోట్లు గడించాడు. ఆ కోటీశ్వరుడి ఇంటికి కుందయ్య అనే అతడి పాత స్నేహితుడు, అందవిహీనుడు వచ్చాడు. అతని పేరు విని, రూపం చూసి వ్యాపారి పరివారం అంతా అతని అసహ్యించు కున్నారు. కాని వ్యాపారి తన చిన్ననాటి స్నేహితుని గుర్తుపట్టి ఆదరించాడు.

అయినా కుందయ్య “మిత్రమా! నేను దురదృష్టజాతకుడిని. ముట్టుకున్నదంతా మట్టి అవుతుంది. నువ్వు పట్టిందంతా బంగారం అవుతుంది, ముట్టినదంతా ముత్యం అవుతుంది. నా దురదృష్టం నిన్నంటుతుందేమో! అన్నాడు. కుందూ! నీగుణం బంగారం, నాకు తెలుసు. నిన్ను నీవు నిందించుకోకు. “ఆత్మన్యూనతా భావం విజయానికి ఆటంకం” నేటి నుంచి నువ్వు నా వ్యాపారానికి కోశాధికారివి. నా కుటుంబంలో ఒక సభ్యుడివి అన్నాడు.

మిగిలిన ఉద్యోగులంతా ఈతని పని ధ్యాస చూసి ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు !’ అని వెక్కిరించారు. వ్యాపారి ‘కన్ను పోయేటంత కాటుక పెట్టుకున్నాడని’ నిందించారు. ఇంతలో వ్యాపారి ఊరు వెళ్ళాల్సి వచ్చింది. కుందూ ! నా వ్యాపారం అనే అరణ్యంలో నక్కలు, పాములు, క్రూరమృగాలున్నాయి జాగ్రత్త! అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆహా! వ్యాపారి వెళ్ళాడు. దొంగలు పడితే ఏంనిర్వాకం చేస్తాడో ! అని హేళన చేశారు.

ఈ కుట్ర తెలిసిన కుందయ్య ఆ రాత్రి కొందరు నమ్మకస్తులను పిలిచి ఒకడిని శంఖం ఊదమని, మరొకడిని మద్దెల దరువు వెయ్యమని, మరొకడిని పాటలు పాడమని పురమాయించాడు. వరుసగా రెండు రాత్రులు గానకచేరీలు జరిగాయి. ఆ హడావుడికి దొంగలు భయపడి పారిపోయారు. వ్యాపారి తిరిగి వచ్చి జరిగింది తెలుసుకొని మిత్రుని తెలివికి మురిసిపోయాడు. తన వ్యాపారంలో వాటా కూడా ఇచ్చాడు.

నీతి : ఆత్మన్యూనతా భావం విజయానికి ఆటంకం.

also read :

-Advertisement-

Ram Charan: పుట్టబోయే బిడ్డ కోసం రామ్ చ‌ర‌ణ్ షాకింగ్ నిర్ణ‌యం.. ఆశ్చ‌ర్యంలో ఫ్యాన్స్

Horoscope (20-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

ట్రెండింగ్ అవుతున్న సమంత, నాగచైతన్య ఫోన్ కాల్..

TruthGPT : ఛాట్‌ జీపీటీకి పోటీగా ఎలన్‌మస్క్‌ కొత్త అస్త్రం.. ట్రూత్‌ జీపీటీ పేరిట ఏఐ!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News