Thursday, May 9, 2024
Homeviral newsViral video : ఈ బుడ్డోడి ఫ్రెండ్లీ నేచర్‌ చూస్తే అవాక్కవుతారు..

Viral video : ఈ బుడ్డోడి ఫ్రెండ్లీ నేచర్‌ చూస్తే అవాక్కవుతారు..

Telugu Flash News

Viral video : చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. చిన్నారులు ముద్దు ముద్దుగా చేసే పనులు, చేష్టలు పేరెంట్స్‌కు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. వారు చేసే చిలిపి చేష్టలు, అల్లరి పనులను తల్లిదండ్రులు వీడియోలు తీసుకొని చూసుకుంటూ మురిసిపోతుంటారు. మిత్రులు, బంధువులకు ఆ వీడియోలను షేర్‌ చేస్తూ సంబరపడిపోతుంటారు.

చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు పెద్దలు. వారు చేసే పనులు నిష్కల్మషంగా ఉంటూ ఇంకా చూడాలనిపించేలా ఉంటాయి. ఇలాంటిదే ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది. ఈ వీడియోలో బుడ్డోడి ప్రవర్తన చూసిన వారంతా హౌ క్యూట్‌ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ బుడతడు ఏం చేశాడో ఈ వీడియోలో చూడండి.

విమానంలో జర్నీ సందర్భంగా ఓ జంట ఈ వీడియోను తీసింది. విమానం ఎక్కిన వెంటనే తమ సీటు వద్దకు వెళ్లారు ఆ జంట. అయితే, వీరికి ఓ బుల్లి బాబు ఉన్నాడు. సీటులో కూర్చోకుండా అందరితో పరిచయ కార్యక్రమానికి పూనుకున్నాడు ఆ చిన్నారి. విమానంలోకి ఎంటర్‌ అయ్యాక మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ అందరికీ షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ ముందుకు పోతున్నాడు.

ఇది చూసిన ప్రయాణికులు హౌ క్యూట్‌ బాయ్‌.. కమాన్‌ కమాన్‌.. అంటూ వారు కూడా బుడతడితో షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. ప్రయాణికులందరికీ ఈ బుల్లిబాబు చేసిన చేష్ట బాగా నచ్చేసింది. మోరిసా స్వార్ట్జ్‌ అనే వ్యక్తి మైక్రో బ్లాగింగ్‌ వేదికపై ఈ వీడియోను షేర్‌ చేశారు. వీడియోలో ప్రతి సీటు వద్దకూ వెళ్తూ చిన్నారి బాబు అందర్నీ పలకరిస్తున్నాడు. చిరునవ్వులు చిందిస్తూ తమ వద్దకు వచ్చిన బాలుడిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు ఆ విమానంలోని ప్రయాణికులు.

వాట్‌ ఎ ఫ్రెండ్లీ సోల్‌..

ఈ వీడియోకు వాట్‌ ఎ ఫ్రెండ్లీ సోల్‌ అంటూ క్యాప్షన్‌ పెట్టారు. షేర్‌ చేసినప్పటి నుంచి నెట్టింట ఈ వీడియోకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పటి వరకు మూడు మిలియన్లకుపైగా వీక్షించారు. 53 వేల మందికిపైగా లైక్‌ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు సైతం కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

-Advertisement-

Also Read:

Cricketers: ఈ నెల‌లో ఇద్ద‌రు భార‌త్ క్రికెట‌ర్స్ పెళ్లి.. వాళ్లెవ‌రు, ఎవ‌రిని చేసుకోనున్నారంటే..!

సికింద్రాబాద్‌-విశాఖ వందే భారత్‌ ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే.. చార్జీలు, రైలు విశేషాలివే..

బొన్నీ గాబ్రియేల్‌ : మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కించుకున్న అమెరికా అందగత్తె

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News