HomesportsCricketers: ఈ నెల‌లో ఇద్ద‌రు భార‌త్ క్రికెట‌ర్స్ పెళ్లి.. వాళ్లెవ‌రు, ఎవ‌రిని చేసుకోనున్నారంటే..!

Cricketers: ఈ నెల‌లో ఇద్ద‌రు భార‌త్ క్రికెట‌ర్స్ పెళ్లి.. వాళ్లెవ‌రు, ఎవ‌రిని చేసుకోనున్నారంటే..!

Telugu Flash News

Cricketers: గ‌త కొద్ది రోజులుగా వ‌రుస షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్న భార‌త క్రికెట‌ర్స్‌లో ఓ ఇద్ద‌రు పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. ఎల్ రాహుల్‌తో పాటు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మేహా పటేల్‌ను వివాహం చేసుకోబోతున్న‌ట్టు తెలుస్తుండగా , ఈ నెల చివరి వారంలో వీరి పెళ్లి జరగనుందని సమాచారం. తన పెళ్లి కోసమే అక్షర్ పటేల్‌ న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడు. ఇక‌ ఈ నెల 23న కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఇటీవ‌లమంచి ఫామ్‌లో ఉన్న అక్ష‌ర్ జ‌ట్టులో స్థానం సుస్థిరం చేసుకునేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నాడు.

ఇక అక్షర్ చాలా కాలంగా మేహా పటేల్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. గతేడాది తన పుట్టినరోజు (జనవరి 20) సందర్భంగా మేహాకు రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడు. అనంతరం తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఇద్దరి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అక్షర్ పటేల్ ఫియాన్సీ మేహా వృత్తి రీత్యా డైటిషియన్, న్యూట్రిషనిస్ట్. అక్షర్‌ పటేల్ డైట్ విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 21 వేల మందికి పైగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. మేహా పటేల్ తన చేతిపై అక్షర్ పటేల్ పేరును పచ్చబొట్టు వేయించుకోవడం విశేషం. గతేడాది వీరిద్దరి నిశ్చితార్థం ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

గ‌తేడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లకు హాజరైన మేహా గ్యాలరీలో తెగ‌సందడి చేసింది. ఈ ఇద్దరి ప్రేమాయణాన్ని ఇరు కుటుంబాలు అంగీకరించాయని, వారి సమక్షంలోనే వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా ఇరు కుటుంబాల సమక్షంలోనే వివాహం చేసుకోవాలని ఈ జోడీ భావిస్తున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పెళ్లి అనంతరం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసి అందర్ని పిలవాలని అనుకుంటున్నార‌ట‌. ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్న అక్షర్ పటేల్.. టీ20 సిరీస్‌తో పాటు వన్డేల్లోనూ అదరగొట్టాడు. తిరువనంతపురం వేదికగా ఈ రోజు జ‌రుగుతున్న ,చివ‌రి వ‌న్డేలో అక్ష‌ర్ ఆడుతున్నాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News