Thursday, May 9, 2024
Homeviral newsViral Video : మూగజీవాన్ని ముద్దు చేయబోయింది.. చివరకు ఊహించని ట్విస్ట్‌!

Viral Video : మూగజీవాన్ని ముద్దు చేయబోయింది.. చివరకు ఊహించని ట్విస్ట్‌!

Telugu Flash News

Viral Video : మూగ జీవాలంటే చాలా మందికి అమితమైన ప్రేమ ఉంటుంది. వాటిని ముద్దాడాలని, వాటితో కలిసి సెల్ఫీలు దిగాలని ఆశిస్తుంటారు. వాటిని ముట్టుకొని మృదువుగా స్పర్శిస్తూ ఆప్యాయత ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని జంతువులు మనుషుల వద్దకు ప్రేమగా వస్తుంటాయి. అయితే, మరికొన్ని జంతువులు వైల్డ్‌గా రియాక్ట్‌ అవుతుంటాయి. దగ్గరకు రాగానే దాడి చేయడం, గాయపరచడం, కొరకడం లాంటి పనులు చేస్తుంటాయి.

అయితే, జంతు ప్రదర్శన శాలల్లో ఉండే సిబ్బంది అప్రమత్తమై రక్షిస్తుంటారు. ఇలా జంతువుల వద్దకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేసి ఉంటారు. తాజాగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మూగ జీవం కదా అని, ముద్దు ముద్దుగా ఉందని చెప్పి ముద్దు పెట్టుకుందామని వెళ్లిన ఓ యువతికి భంగపాటు తప్పలేదు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో మీరూ ఓ లుక్కేయండి. యువతికి మూగజీవం ఎందుకు ట్విస్ట్‌ ఇచ్చిందో తెలుసుకోండి.

Viral Video : ఆకాశంలో వింత వస్తువు.. పైలెట్‌కు ఎగురుతూ కనిపించిన ఆకారం..

ఈ వీడియో యూజర్లకు విపరీతంగా నచ్చడంతో వైరల్ చేస్తున్నారు. సరదాగా గడిపే క్రమంలో ఓ యువతి చేసిన చిలిపి పనితో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండలేరు. ఓ యువతి అల్పాకాను ముద్దు పెట్టుకోవడానికి సరదాగా ట్రై చేసింది. అల్పాకాను ముద్దు పెట్టుకోవడానికి దగ్గరగా వెళ్తుంది. ఇంతలో అల్పాకా ఆ యువతిపై గాండ్రించి ఉమ్మేస్తుంది. దీంతో ఆ యువతి తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి జంప్‌ అయిపోతుంది. ఈ సరదా సన్నివేశాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. అది వైరల్‌ అయిపోయింది.

ఈ వీడియోను ‘taninmisphenomen’ అనే అకౌంట్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ ఫన్నీ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది చూశారు. అదే సమయంలో వీడియోపై కామెంట్లు జోరుగా వస్తున్నాయి. మూగజీవాలతో సరదాగా ఉండడం తప్పుకాదని.. కానీ, కొన్నిసార్లు ఇలాంటివే ఎదురవుతాయంటున్నారు. జంతువుల వద్దకు వెళ్లేటప్పుడు చూసుకోవాలి కదమ్మా.. అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జంతువులకు ముద్దులు పెట్టాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలని చెబుతున్నారు.

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News