HometelanganaKTR On Amit Shah : అమిత్‌ షాకు మంత్రి కేటీఆర్ థ్యాంక్స్‌.. ఏ విషయంలో అంటే..

KTR On Amit Shah : అమిత్‌ షాకు మంత్రి కేటీఆర్ థ్యాంక్స్‌.. ఏ విషయంలో అంటే..

Telugu Flash News

KTR On Amit Shah : కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై పోరుబాట సాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీ.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా సహా బీజేపీ అగ్ర నేతలపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ సహా ముఖ్య నేతలంతా ఆరోపణల పర్వం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్.. హోంమంత్రి అమిత్‌ షాకు థ్యాంక్స్‌ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇంతకీ ఆయన థ్యాంక్స్‌ ఎందుకు చెప్పాడంటే… సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌)లో నియామక పరీక్షలను తెలుగుతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల నుంచి పరీక్ష రాసే వేలాది మంది అభ్యర్థులకు మేలు కలుగుతుందన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను సవరించాల్సిందిగా ఇటీవలే మంత్రి కేటీఆర్.. అమిత్‌ షాకు విన్నవించారు.

మొత్తం 9,212 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. అయితే, నోటిఫికేషన్‌లో కేవలం హిందీ, ఆంగ్ల భాషల్లో మాత్రమే పరీక్ష రాసే సౌలభ్యం కల్పించారు. దీంతో కేటీఆర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇతర ప్రాంతీయ భాషలు, అధికార భాషలను కూడా అందులో చేర్చాలని మంత్రి కేటీఆర్ కోరారు.

ఈ పోటీ పరీక్షలను కేవలం హిందీ, ఇంగ్లిష్‌లలోనే నిర్వహించడం వల్ల ఇంగ్లిష్‌ మీడియంలో చదవని వారు, హిందీయేతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని కేటీఆర్ తెలిపారు. ఇదే అంశంపై తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కూడా స్పందించారు. అమిత్‌ షాకు లేఖ ద్వారా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కోరారు. 100 మార్కుల్లో 25 మార్కులు హిందీకి కేటాయించడం ద్వారా హిందీ తెలిసిన వారు మాత్రమే ఈ పరీక్షలు రాసేందుకు అనుకూలంగా ఉందని చెప్పారు.

ఇలా చేయడం పౌరుల సమాన హక్కులకు భంగం కలిగించినట్లవుతుందన్నారు. దీనిపై జోక్యం చేసుకొని అన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించి యువత సీఆర్‌పీఎఫ్‌లో పని చేసేలా అవకాశం కల్పించేలా అధికారులను ఆదేశించాలని స్టాలిన్‌ కోరారు. దీంతో వీరి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. సీఆర్‌పీఎఫ్‌ నియామక పరీక్షను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో తెలంగాణ మంత్రి కేటీఆర్.. హోంమంత్రి అమిత్‌ షాకు థ్యాంక్స్‌ చెబుతూ ట్వీట్‌ చేశారు.

-Advertisement-

Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక మలుపు.. అవినాశ్‌ రెడ్డి అనుచరుడి అరెస్ట్‌

Ananya Nagalla: న‌న్ను ఎవ్వరూ ట్రై చేయ‌లేదు.. అన‌న్య ఆస‌క్తిక‌ర కామెంట్స్

Upasana: మెగా కోడ‌లు ఉపాస‌న త‌న సంపాద‌న మొత్తం వారికే ఇచ్చేసిందా?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News