HomenewsViral Video : ఆకాశంలో వింత వస్తువు.. పైలెట్‌కు ఎగురుతూ కనిపించిన ఆకారం..

Viral Video : ఆకాశంలో వింత వస్తువు.. పైలెట్‌కు ఎగురుతూ కనిపించిన ఆకారం..

Telugu Flash News

Viral Video : ఆకాశ వీధిలో అరుదైన వస్తువులు, పరికరాలు, ఆకారాలు అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఆకాశం అంటేనే అంతుచిక్కనిది. ఇందులో రకరకాల వస్తువులు దర్శనం ఇస్తూ, వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటిని అనేక పరిశోధన సంస్థలు గుర్తించి ప్రపంచానికి పరిచయం చేస్తుంటాయి. మానవుడు విమానాలు కనిపెట్టినప్పటి నుంచి ఆకాశంలో వింతలు గుర్తించడం కాస్త సులభం అయిపోయింది.

Viral Video : మరువలేని మమకారం.. నెలరోజుల తర్వాత ఆరిఫ్‌ వెళ్తే జూలో కొంగ ఎంతలా పరితపించిందో చూడండి..

అంతుచిక్కని వింత వస్తువులను యునైటెడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ గా పిలుస్తుంటారు. తాజాగా కొన్నాళ్ల కిందటే అగ్రరాజ్యం అమెరికాలోని గగనతలంలో ఓ బెలూన్ లాంటిది కనిపించింది. ఆ ఆకారం అందరికీ ఆశ్చర్యంగా కనిపించింది. వెంటనే దాన్ని యూఎస్ ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సముద్రంపైనే దాన్ని కూల్చివేశారు. అనంతరం చైనా దేశానికి చెందిన నిఘా బెలూన్‌గా గుర్తించారు.

ఇక తాజాగా విమానం నడుపుతున్న ఓ పైలెట్‌కు వినీలాకాశంలో ఓ వింత వస్తువు తారసపడింది. దాన్ని చూడగానే వింతగా అనిపించింది. అనంతరం సెల్ ఫోన్ చేత పట్టుకొని పైలెట్ దాన్ని వీడియో రికార్డింగ్ చేశాడు. ఇది కాఫీ లేదా టీ కప్పు పెట్టుకొనే సాసర్ ఆకారంలో కనిపించింది. అయితే, అది ఏం వస్తువు అనేది పైలెట్ నిర్ధారించలేకపోయాడు.

Viral Video : బైక్‌ను నీటిలో కూడా నడుపుతారా.. ఈ వీడియో చూసేయండి..

విమానం నడుపుతుండగా కనపడిన ఆ వస్తువు బెలూన్, డ్రోన్ లాంటి వస్తువు కాదని పైలెట్ జార్జ్ చెప్పాడు. ఈ తరహా వస్తువును తాను మునుపెన్నడూ చూడలేదని, జీవితంలో ఇలాంటి ఘటన ఎదురు కాలేదని తెలిపాడు. అందుకే దాన్ని వెంటనే సెల్ ఫోన్ తీసుకొని వీడియో తీశానని తెలిపాడు. భూమికి సుమారు 12,500 అడుగుల ఎత్తులో, 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనూ సదరు వస్తువు గాలిలో అతి సునాయాసంగా తేలుతోందన్నాడు.

-Advertisement-

గుర్తు తెలియని ఆ వస్తువు హీలియం లేదా సోలార్ బెలూన్ అయి ఉండొచ్చని ఈ వీడియో చూసిన కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఆ వస్తువు ఏంటా అనే దానిపై చాలా మంది స్పందిస్తున్నారు. అదేంటో అంతు చిక్కడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొందరు నెటిజన్లు కాస్త భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.

అది అసలు నిజమైన వీడియో కాదంటున్నారు. వీడియోలో గ్రాఫిక్స్ చేసి ఇదంతా చూపించారని చెబుతున్నారు. బెలూన్, గాలిపటం ఆకారంలో లేని ఆ వస్తువు గాలిలో ఎగరటం అనేది ఇంపాజిబుల్ అని చెబుతున్నారు. కేవలం గ్రాఫిక్ చేసి దీన్ని రూపొందించారని, కచ్చితంగా ఇది ఫేక్ వీడియో అంటున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News