Thursday, May 9, 2024
Homeviral newsViral Video Today : అక్రమ మద్యం కేసులో రామచిలుక అరెస్టు..

Viral Video Today : అక్రమ మద్యం కేసులో రామచిలుక అరెస్టు..

Telugu Flash News

Viral Video Today : సాధారణంగా అక్రమ మద్యం ప్రతి రాష్ట్రంలోనూ పట్టుకుంటూ ఉంటారు ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ పోలీసులు. ఇందులో రకరకాల పద్ధతుల్లో మద్యాన్ని మరో రాష్ట్రం నుంచి తీసుకొస్తూ నిందితులు పట్టుబడుతూ ఉంటారు. చిత్ర విచిత్రమైన పద్ధతుల్లో మద్యాన్ని తీసుకొస్తుంటారు నిందితులు. కొందరు పోలీసుల కన్నుగప్పి తప్పించుకుంటూ ఉంటారు. మరికొందరు దొరికిపోతూ కటకటాల వెనక్కు వెళ్తుంటారు.

అయితే, అక్రమ మద్యం ఘటనలో ఇప్పుడు సరికొత్త ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్రమ మద్యం కేసులో మైనర్లను, మూగజీవాలను కూడా అరెస్టు చేసిన ఘటనలు చూశాం. కానీ, తొలిసారి బిహార్‌ పోలీసులు చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ఓ చిలుకను అక్రమ మద్యం కేసులో అరెస్టు చేయడం గమనార్హం. నేరస్తుడిని పట్టుకొనేందుకు, అతని జాడ తెలుసుకొనేందుకు కష్టపడటం మాని చిలక జోస్యాన్ని నమ్ముకోవడంపై దుమారం రేగుతోంది. ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ తిరుగుతోంది.

బిహార్‌ రాష్ట్రం గయాలోని గురువా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ కుగ్రామం ఉంది. అక్కడ అక్రమ మద్యం విక్రయిస్తున్నట్లుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్‌ వెళ్లింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ కన్హయ్యకుమార్‌ తన బృందంతో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించారు. అక్కడికి వెళ్లి విస్తృత దాడులు చేశారు పోలీసులు. కానీ ఈ విషయాన్ని చిలుక గమనించి తన పలుకులతో సంకేతం ఇవ్వడంతో అక్రమ మద్యం అమ్ముతున్న వ్యక్తి అమృత్‌ మల్లా కుటుంబ సభ్యులతో సహా అక్కడి నుంచి ఉడాయించాడు.

చిలుక స్వామి భక్తి..

ఎవరికీ చెప్పకుండా పోలీసులు వెళ్లినా నిందితులు తప్పించుకోవడంపై పోలీసులకు అంతు చిక్కలేదు. అక్కడే ఉన్న చిలుకను చూసి వారికి అనుమానం వచ్చింది. అయితే, చిలుకే వారికి సంకేతాలు ఇచ్చి తప్పించుకొనేలా చేసిందని పోలీసులు అనుమానించి దాన్ని అదుపులోకి తీసుకున్నారు. బోనులో బంధించి స్టేషన్‌కు తరలించారు. అయితే, చిలుక మాత్రం నోరు విప్పడం లేదట. యజమానిని కాపాడేందుకు చిలుకు స్వామి భక్తి ప్రదర్శించడంపై పోలీసులు విస్తు పోతున్నారు. అయితే, పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను పట్టుకోవడం మానేసి ఇలా చిలుకను అరెస్టు చేయడం సబబు కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

also read :

-Advertisement-

Layoffs : లేఆఫ్స్‌తో అమెరికాలో లక్ష మంది తెలుగు వారి ఇక్కట్లు!

Pakistan Crisis : పాకిస్తాన్‌లో సంక్షోభం తీవ్రతరం.. డాలర్‌తో పోలిస్తే రూ.255కు పడిపోయిన పాక్‌ రూపాయి విలువ!

KCR Visit to Nanded : నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ సభకు సర్వం సిద్ధం.. కేసీఆర్‌ పర్యటన వివరాలివీ..

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News