Homecinemaurfi javed : ఈ బ్యూటీకి ఇల్లు కూడా అద్దెకు ఇవ్వ‌డం లేదట‌..

urfi javed : ఈ బ్యూటీకి ఇల్లు కూడా అద్దెకు ఇవ్వ‌డం లేదట‌..

Telugu Flash News

బిగ్ బాస్ షోతో చాలా మందికి ద‌గ్గ‌రైన హాట్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ (urfi javed). ఈమె త‌న డ్రెస్సింగ్‌తో నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. విభిన్నమైన దుస్తులు ధరిస్తూ యూత్ ఆడియెన్స్‌లో క్రేజ్  తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

త‌న‌పై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా కూడా త‌న‌కు న‌చ్చిన‌ట్టుగానే జీవిస్తూ ఉంటుంది ఉర్ఫీ. తాజాగా ఈ అమ్మ‌డు ఇబ్బందుల్లో ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది. ఈ అందాల భామకు ముంబైలో ఎవరూ అద్దెకు ఇవ్వడం లేదట. తనకు వచ్చే రాజకీయ బెదిరింపుల కారణంగానే ఎవరూ అద్దెకు ఇల్లు ఇవ్వడం లేదన్నారు ఉర్ఫీ.

తన వస్త్రధారణ కారణంగా కూడా యజమానులు ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదని ఉర్ఫీ చెప్పుకొస్తుంది. ముంబైలోని ముస్లిం ఇంటి యజమానులు తాను దుస్తులు ధరించే విధానం కారణంగా అద్దె ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని అన్న‌ది.

తాను ముస్లిం కాబట్టి హిందూ యజమానులు అద్దెకు ఇల్లు ఇవ్వడం లేదని తెలిపింది. దీనిపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘నేనూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నా. మీకు త్వరగా మంచి ఇల్లు దొరకాలని కోరుకుంటున్నా’ అని ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు.

దీనికి స్పందించిన ఉర్ఫీ .. ‘ప్రతిసారీ ఇదే జరుగుతోంది. మ్యారేజ్ కాని ఓ నటికి ఇల్లు అద్దెకు దొరకడం అసాధ్యమే’ అంటూ ఉర్ఫీ బదులిచ్చింది. కాగా, 2021లో ప్రసారమైన ‘బిగ్‌బాస్ ఓటీటీ’లో ఆమె కంటెస్టెంట్‌గా హిందీ బిగ్‌బాస్ షో లో పాల్గొని సంద‌డి చేసింది.

also read :

-Advertisement-

Viral Video Today : అక్రమ మద్యం కేసులో రామచిలుక అరెస్టు..

Layoffs : లేఆఫ్స్‌తో అమెరికాలో లక్ష మంది తెలుగు వారి ఇక్కట్లు!

Pakistan Crisis : పాకిస్తాన్‌లో సంక్షోభం తీవ్రతరం.. డాలర్‌తో పోలిస్తే రూ.255కు పడిపోయిన పాక్‌ రూపాయి విలువ!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News