HomeinternationalLayoffs : లేఆఫ్స్‌తో అమెరికాలో లక్ష మంది తెలుగు వారి ఇక్కట్లు!

Layoffs : లేఆఫ్స్‌తో అమెరికాలో లక్ష మంది తెలుగు వారి ఇక్కట్లు!

Telugu Flash News

IT companies Employees layoffs : అగ్రరాజ్యంలో టెకీలకు పెద్ద కష్టం వచ్చి పడింది. ప్రస్తుతం లేఆఫ్‌ల సీజన్‌ నడుస్తుండడంతో ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఉంటుందో, ఎవరి ఉద్యోగం ఊడుతుందోనని భయాందోళనలు పట్టుకున్నాయి. ఉద్యోగాల తొలగింపు అంశంలో సీనియర్‌ ఎంప్లాయా, జూనియరా అని చూడటం లేదు. కంపెనీ చేపట్టిన ప్రాజెక్టు లాభదాయకమా? లేదా? అని మాత్రమే యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా పని చేస్తున్న ఉద్యోగుల్ని సైతం ఇంటికి పంపేస్తున్నాయి ఐటీ కంపెనీలు.

నోటి మాట కూడా కాదు.. ఒక్క ఈమెయిల్‌తోనే ఉద్యోగాన్ని పీకేస్తున్నాయి యాజమాన్యాలు. ఈ క్రమంలో వేలాది మంది టెకీల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. దిగ్గజ సంస్థలైనప్పటికీ ఆర్థిక మాంద్యం కారణంగా ఈ నిర్ణయాలు తీసుకుంటుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోందని బాధిత ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడా కంపెనీలన్నీ ఇదే బాట పట్టడంతో ముఖ్యంగా భారతీయులు మండిపడుతున్నారు. అవసరం ఉన్నప్పుడు తీసుకొని ఇప్పుడు క్షణం ఆలోచించకుండా లేఆఫ్‌ల పేరిట ఉద్యోగాలు తొలగించడం సమంజసం కాదని చెబుతున్నారు.

ఏడాది, రెండేళ్లలో చేరిన వారితో పాటు 20 ఏళ్లుగా సుదీర్ఘంగా కంపెనీల్లో పని చేస్తున్న వారికి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. దశాబ్దాలుగా ఉద్యోగులను అడ్డం పెట్టుకొని కోట్లు గడించిన సంస్థలు ఇప్పుడు ఉన్నఫళంగా ఇలా చేయడంపై ఐటీ సెక్టర్‌లో కలకలం రేపుతోంది. ఆర్థిక మాంద్యం, నష్టాల నుంచి గట్టెక్కేందుకే ఇలా చేస్తున్నామని కంపెనీలు ప్రకటించడం గమనార్హం. సాధారణంగా పిల్లల చదువులు, తల్లిదండ్రులపై ప్రభావం పడకుండా ఇంతకు ముందు కంపెనీలు జాగ్రత్తలు తీసుకొనేవి. ఈసారి అది కూడా పట్టించుకోలేదు.

తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు లక్ష మంది అమెరికాలో ఐటీ కొలువులు చేస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతకు ముందు ఉద్యోగాలు తొలగించే క్రమంలో కంపెనీ సుమారు రెండు నుంచి మూడు నెలల ముందే ఉద్యోగికి సమాచారం అందించేవి. ఇప్పుడు అలాంటి సమయం కూడా ఇవ్వడం లేదు. వెంటనే ఇంప్లిమెంట్‌ చేసేస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త కొలువు మూడు నెలల్లో సాధించుకోలేకపోతే హెచ్‌1బీ వీసా కలిగి ఉన్న వారు అమెరికాను వీడాల్సిందే.

స్కిల్డ్‌ ఎంప్లాయీస్‌కు ఢోకా లేదు..

ఈ క్రమంలో బడా కంపెనీల కంటే చిన్న కంపెనీల్లో చేరి ఆర్థిక మాంద్యం ముగిసే వరకు అక్కడే కొనసాగాలని సెటిలర్లు భావిస్తున్నారు. అయితే, ఉద్యోగాల తొలగింపుకు గురైన వారు నైపుణ్యం కలిగి ఉంటే వారికి మధ్యతరహా సంస్థలు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయని, స్కిల్డ్‌ ఎంప్లాయీస్‌ ఖంగారు పడాల్సిన పని లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

also read:

-Advertisement-

KCR Visit to Nanded : నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ సభకు సర్వం సిద్ధం.. కేసీఆర్‌ పర్యటన వివరాలివీ..

Breaking news : లోకేష్ పాదయాత్ర లో తారక రత్న కు కార్డియాక్ అరెస్ట్.. కొనసాగుతున్న అత్యవసర చికిత్స

Lokesh Padayatra: నేటి నుంచే యువగళం పాదయాత్ర.. సుదీర్ఘ ప్రయాణానికి నారా లోకేష్‌ తొలి అడుగు

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News