Wednesday, May 8, 2024
Homeviral newsViral Video: అమ్మాయిలూ.. బైక్‌పై ఇలాంటి ఫీట్లు అవసరమా? తృటిలో తప్పిన ప్రమాదం..

Viral Video: అమ్మాయిలూ.. బైక్‌పై ఇలాంటి ఫీట్లు అవసరమా? తృటిలో తప్పిన ప్రమాదం..

Telugu Flash News

Viral Video : బైక్‌ దొరికిందంటే స్టంట్లు చేసే వారు మనకు కనిపిస్తుంటారు. యువకులతో పాటు అమ్మాయిలు కూడా నేటి కాలంలో అక్కడక్కడా బైకులపై స్టంట్లు చేస్తూ కనిపిస్తుంటారు. అయితే, ఫీట్లు చేసే క్రమంలో ప్రమాదాలకు గురవుతుంటారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ఇటీవలే ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువకుడు బైక్‌పై ఇలా ఫీట్లు చేస్తూ హెల్మెట్‌ ధరించకపోవడంతో కింద పడ్డాడు. తర్వాత కొంత కాలం పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిలా లాభం లేకపోయింది. తలకు బలమైన గాయం కావడంతో ఆ యువకుడు మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతుంటాయి.

also watch: Viral Video : ఫూటుగా తాగి మండపంలోనే నిద్రపోయిన పెళ్లికొడుకు..

బైక్‌పై వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా డ్రైవ్‌ చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఏమరపాటుకు గురైనా ప్రమాదాలకు గురవుతుంటారు. ఒక్కోసారి మనం సక్రమంగానే డ్రైవ్‌ చేసినా ఎదుటి వ్యక్తులు ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి మన ప్రాణాల మీదకు తెస్తుంటారు. ఇలా ఇతరులను ఇబ్బంది పెట్టేందుకే కొందరు రోడ్లమీదకు వస్తుంటారు. ఇక ఇద్దరు అమ్మాయిలు బైక్‌ ఎక్కి ఫీట్లు చేయాలని ప్రయత్నించడంతో అది విఫలమైన ఘటన ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనలో వారికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. కేలం కింద పడిపోవడంతో సరిపోయింది.

also watch : Viral Video : ఇది బైకా.. ప్యాసింజర్‌ ట్రైనా.. ఏకంగా ఎనిమిది మంది ఎలా ప్రయాణించారో చూడండి!

వైరల్‌ అయిన ఆ వీడియోలో ఇద్దరు యువతులు డ్రైవింగ్‌ చేస్తూ ఫీట్లు చేయాలని ట్రై చేశారు. అమ్మాయిలు కొత్తగా డ్రైవింగ్‌ నేర్చుకొనే సందర్భాల్లో ఇలాంటి చిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. నేర్చుకోవాలనే ఉత్సాహంతో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో బ్రేకుకు బదులుగా రైజ్‌ పెంచుతూ ప్రమాదాలకు గురవతుంటారు. ఈ వీడియోలో కూడా ఓ అమ్మాయి కూడా కొత్త పద్ధతిలో బైక్ నడపడం నేర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.

also watch : Viral Video : మైమరచిన ప్రేమికులు.. బైకు రన్నింగ్‌లో ఉండగా ముద్దులు, హగ్గులు..!

-Advertisement-

ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు బైక్‌ నడుపుతారు. ముందున్న అమ్మాయి డ్రైవ్‌ చేస్తూ ఒక్కసారిగా బైక్‌ను గాల్లోకి లేపుతుంది. దీంతో వెనక కూర్చున్న అమ్మాయితో సహా ఇద్దరూ వెనక్కు జారిపోయి కింద పడిపోతారు. అయితే, వెనకవైపు ఉన్న అమ్మాయి హెల్మెట్‌ ధరించడంతో తల కింద పడ్డా కూడా ప్రమాదం జరగలేదు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం జరిగే రీతిలో ప్రమాదం జరగలేదని, ఇద్దరూ బతికిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్‌ చేశారు. నెటిజన్లు దీన్ని చూసి భిన్నమైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు.

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News