Homecinemaఅలనాటి తెలుగు నటి చాయా దేవి గురించి మీలో ఎంత మందికి తెలుసు?

అలనాటి తెలుగు నటి చాయా దేవి గురించి మీలో ఎంత మందికి తెలుసు?

Telugu Flash News

సినీ ప్రపంచంలోకి ఎంతో మంది నటీనటులు వస్తూవెళ్తుంటారు కానీ పేరుతో పాటు తమకంటూ ఒక స్థాయిని పొంది ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే వారు చాలా తక్కువ. అలా ఆకట్టుకునే నటనతో గొప్ప వ్యక్తిత్వంతో అందరి ఆదరణ పొందిన వారిలో నటి చాయా దేవి కూడా ఒకరు.

సూర్య కాంతం తరువాత గయ్యాళి పాత్రలలో ఎవరైనా చేయగలరు, చేసి మెప్పించారు అంటే అది ఛాయాదేవి మాత్రమే.ఈ కాలం వారికి ఆమె ఎవరో అంతగా తెలియకపోయినా ఆ కాలంలో సినీ నటి చాయా దేవి అంటే తెలియని వారుండరంటే అది అతిశయోక్తి కాదేమో.

1928లో గుంటూరులో ఒక మామూలు కుటుంబంలో జన్మించారు చాయా దేవి. 1942లో దీన బంధువు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన చాయా దేవీ మొదటి సినిమాలతోనే తన విలక్షణమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదంచుకుంది.

ఆ తరువాతి కాలంలో పరమానందయ్య శిష్యులు, జ్యోతి, గుండమ్మ కథ, మాయ బజార్, శ్రీ కృష్ణార్జున యుద్ధం, తాయారమ్మ బంగారయ్య లాంటి ఎన్నో గొప్ప సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించి మెప్పించింది.

తను సినిమాలకు రాక ముందు పడిన కష్టాలు ఎవరూ పడకోడదని భావించిన చాయా దేవి కష్టం అంటూ ఎవరు వచ్చిన కాదనకుండా సాయం చేసేవారట. ఇంటికి ఎవరొచ్చినా సరే వారికి భోజనం పెట్టే ఇంటి నుండి పంపేవరాట.

అలాంటి మంచి మనసుతోనే చాలా మంది నిర్మాతలకు డబ్బులు కావాలంటే మరో క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేసేవారట. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని తన జీవితం అప్పుడే తను ఊహించని మలుపులు తిరిగడం మొదలైంది.

-Advertisement-

కొంత కాలం సంతోషంగానే సాగిన ఆమె జీవితం కొద్ది కొద్దిగా మారడం మొదలైంది.ఆమె కాదనకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళు తప్పించుకుని తిరగడం మొదలు పెట్టారు. ఆమెకు తన ఆరోగ్యంపై అంతగా అవగాహన లేకపోవడంతో తనకు తెలియకుండానే తన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. కొద్దిగా మొదలైన మధుమేహం పెరిగి పెరిగి తన బొటన వేలుకు ఇన్ఫెక్షన్ గా వ్యాపించింది. దాంతో తన బొటన వేలును తొలగించారు.

అక్కడితో ఆగకుండా కాలుకు కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో ఇక చేసేదేమీ లేక తన కాలును కూడా తొలగించడంతో చాయా దేవి మంచానికే అంకితమయ్యింది. తన జీవితంలో అలాంటి కటిన సమయం గడుపుతున్న రోజులలోనే ఎవరో ఒక వ్యక్తి చాయా దేవీ కొనుక్కుని నివసిస్తున్న ఇల్లు అతనిదని కోర్టులో కేసు వేశాడు.

డబ్బు తీసుకున్న వాళ్ళు కూడా అసలు అటు తిరిగి కూడా చూడకపోవడం,ఆమె ఒంటరిది
కావడం, అప్పులు పాలు అవ్వడం, అప్పటి వరకు దాచుకున్న డబ్బంతా వైద్యానికి మిగతా వాటికి కర్చై కరిగిపోవడంతో చాయా దేవి జీవితం మరింత దారుణంగా మారింది.

చివరికి తినడానికి కూడా చిల్లి గవ్వ లేకపోయింది.ఒకప్పుడు అందరికి కాదనకుండా సహాయం చేసిన ఆమె చెయ్యి సహాయం కోసం ఎదురు చూపులు చూసింది. ఆఖరికి ఎవరి అండా లేక ఎవరూ ఆదుకోక చాలా ఘోరమైన స్థితి లో 1983 సెప్టెంబర్ 4న కన్ను మూసింది చాయాదేవి.

also read news: 

ICC: పాకిస్తాన్‌కి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన ఐసీసీ… మ‌రోసారి అలా చేస్తే ఇక అంతే..!

dandruff : చలికాలంలో చుండ్రు సమస్యలతో సతమతం అవుతున్నారా? పరిష్కార మార్గాలు ఇవే..

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News