Monday, May 13, 2024
Homecinemaspecial stories : 'ఐరన్ లెగ్ శాస్త్రి' .. ఆ పాత్ర తన జీవితాన్నే మార్చేసింది..!

special stories : ‘ఐరన్ లెగ్ శాస్త్రి’ .. ఆ పాత్ర తన జీవితాన్నే మార్చేసింది..!

Telugu Flash News

కొన్ని సినిమాలలో పాత్రలను ప్రేక్షకులు అంత సులభంగా మరిచిపోలేరు. ఎందుకంటే ఆ పాత్రలలో నటించిన నటుల ప్రతిభ అలాంటిది. దాని వల్ల ప్రేక్షకులకు ఆ నటులపై అభిమానం పెరుగుతుంది. నటులకు రెండు మూడు సినిమాలు పెరుగుతాయి. కానీ అలాంటి ఒక సినిమాలలో పాత్రే ఒకరి జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసిందంటే నమ్ముతారా..? అసలు నమ్మగలరా..?

ఐరన్ లెగ్ శాస్త్రి (iron leg sastry) అంటే ఈ కాలం వారికి అంతగా తెలియకపోయిన ఆ కాలం వారికి మాత్రం బాగా పరిచయం ఉన్న పేరే. కానీ ఆయన అసలైన పేరు ఐరన్ లెగ్ శాస్త్రి కాదు గునుపూడి విశ్వనాథ శాస్త్రి.

తాడేపల్లి గూడానికి చెందిన ఆయన సినిమాలలోకి రాక ముందు సినిమాల ప్రారంభోత్సవాలకు పౌరోహిత్యం వహించేవాడట. అలా ఆయన పౌరోహిత్యం వహిస్తున్న సమయంలో కామెడీ సినిమాలు తీయడంలో పేరు గాంచిన ఇ.వి.వి.సత్యనారాయణ (E.V.V. Satyanarayana) విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతున్న తీరును చూసి ఆయనకి 1991లో విడుదలైన అప్పుల అప్పారావు (appula apparao) సినిమాలో ఐరన్ లెగ్ శాస్త్రి అన్న ఒక పాత్రను ఇచ్చారట.

సినీ ప్రయాణం

ఆ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో విశ్వనాథ శాస్త్రి పేరు ఐరన్ లెగ్ శాస్త్రి అయిపోయింది. అదే విధంగా ఆ సినిమాతో మంచి పేరు రాగా మరి కొన్ని సినిమాలు ఆయన చెంతకు వచ్చి చేరాయి. అక్కడ నుంచి ప్రేమ ఖైదీ, ఏవండీ ఆవిడ వచ్చింది, ఆవిడా మా ఆవిడే, పేకాట పాపారావు లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులకు మరింత చేరువయ్యాడు విశ్వనాథ శాస్త్రి.

అప్పట్నుంచి తన సినీ ప్రయాణం ముగిసేంత వరకు నటించి ప్రేక్షకులను అలరిస్తూ నవ్వులు పంచాడు. కానీ అప్పుడే ఆయన జీవితం తలకిందులు కావడం మొదలైంది.

-Advertisement-

మొదట్లో సినిమాల అవకాశాలు బాగానే వచ్చినప్పటికీ పోనూ పోనూ ఆయనను సినిమాలలో తీసుకోవడం దర్శకులు తగ్గించేయడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. సినిమాలలో అవకాశాలు తగ్గి సంపాదన సరిపోకపోవడంతో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి మళ్ళీ పౌరోహిత్యం వైపుకు వెళ్ళారు విశ్వనాథ శాస్త్రి.

కానీ ఆయన సినిమాలలో సంపాదించుకున్న ఐరన్ లెగ్ పాత్ర వల్ల ఎవరూ ఆయనని ఎటువంటి ఫంక్షన్లకు పిలవకపోవడంతో ఇక చేసేదేమీ లేక తమ సొంత ఊరు తాడేపల్లి గూడానికి తిరిగి వెళ్ళిపోయారు. అప్పటికే ఆర్థికంగా దెబ్బ తినడం,ఆయనకు సరైన సంపాదన లేక పోవడంతో విశ్వనాథ శాస్త్రి మానసికంగా కృంగిపోయారు.

దీనికి తోడు అలాంటి క్లిష్ట సమయంలోనే ఆయన బాధలకు గుండె జబ్బు కూడా తోడైంది. చివరి రోజులలో పచ్చ కామెర్లతో కూడా బాధ పడిన ఆయన 2006, జూన్ 19న తన స్వస్థలంలో కన్ను మూశారు.

ఆర్థికంగా దెబ్బతిని, తినడానికి చేతిలో చిల్లీ గవ్వ లేక ఇబ్బంది పడుతున్న ఆయన కుటుంబం తమకు సహాయం చేయమని ప్రభుత్వాన్ని వేడుకున్న సంఘటన అందరికీ మరింత బాధను కలిగించింది. కొంచెం ఊరట కలిగించే విషయం ఏంటంటే ఆ సమయంలో కొంత మంది నటులు ముందుకు వచ్చి సహాయం చేయడంతో పాటు విశ్వనాథ శాస్త్రి కుటుంబానికి మేమున్నాము అని ధైర్యం ఇచ్చారు.

తన తండ్రి మరణంపై ఆయన కొడుకు మాట్లాడుతూ వాళ్ళ నాన్న చనిపోవడం వాళ్ళకు తీరని లోటని, తాము ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయన చదువుకు నటుడు కాదంబరి కిరణ్ గారు ఎంతో సహాయ పడ్డారని, అందువల్లనే తాను సి.ఏ పూర్తి చేయగలిగాను అని అన్నారు.

ఆయన పాత్ర తెచ్చిన పేరే విశ్వనాథ శాస్త్రి ప్రాణం తీసిందని ఆయన కొడుకు వాపోయారు.
ఏదేమైనా ఒక మనిషి జీవితం కేవలం ఒక పాత్ర వల్ల ఇంతగా మారిపోవడం ఎవరూ ఊహించనిది. ఊహించలేనిది.

also read news:

Kohli: మ‌ళ్లీ కోహ్లీపై ట్రోల్స్ మొద‌లు.. క్యాచ్ డ్రాప్ అయితేనే సెంచ‌రీ చేయ‌గ‌ల‌డు..! 

8 Ganesh Temples in Maharashtra : అష్టగణపతి క్షేత్రములు 

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News