Monday, May 13, 2024
HomesportsSourav Ganguly : గంగూలీ బయోపిక్‌కు వేగంగా అడుగులు.. హీరోగా ఎవరు నటిస్తున్నారంటే!

Sourav Ganguly : గంగూలీ బయోపిక్‌కు వేగంగా అడుగులు.. హీరోగా ఎవరు నటిస్తున్నారంటే!

Telugu Flash News

ఇండియన్‌ క్రికెట్‌లో అగ్రెసివ్‌నెస్‌కు పెట్టింది పేరు సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) . క్రికెటర్‌ చరిత్రలో మరపురాని విజయాలు నమోదు చేయడంలో గంగూలీ తనదైన మార్క్‌ కెప్టెన్సీ ప్రదర్శించాడని చెబుతారు. టీమిండియాకు కెప్టెన్‌గా, బీసీసీఐ ప్రెసిడెంట్‌గానూ సేవలందించిన గంగూలీ బయోపిక్‌ ఇప్పుడు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

క్రికెట్‌ చరిత్రలో ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్లు, వరల్డ్‌ కప్‌ విజేతలు మహేంద్రసింగ్‌ ధోని, కపిల్‌ దేవ్‌, మరో క్రికెటర్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ల జీవిత కథల ఆధారంగా బయోపిక్‌లు తెరకెక్కాయి.

sourav ganguly sachin tendulkar ఇప్పుడు దాదా బయోపిక్‌ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే, తన బయోపిక్‌ కోసం తానే స్క్రిప్ట్‌ రాస్తున్నట్లు గంగూలీ ప్రకటించారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొన్న టీమిండియాను తన కెప్టెన్సీతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఘనత గంగూలీదే.

గంగూలీ సారథ్యంలో టీమిండియా స్వదేశం, విదేశాల్లోనూ చిరస్మరణీయ విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గంగూలీ స్టేడియంలో షర్ట్‌ విప్పేసి చేసిన విజయోత్సాహం అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. తన బయోపిక్‌లో ఈ సీన్‌ హైలెట్‌ అయ్యే చాన్స్‌ ఉందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయినట్లు తెలుస్తోంది. సినిమా డీల్‌ కోసం ఇప్పుడు గంగూలీ ముంబైలో ఉన్నారు.

హీరోగా ఎవరు నటిస్తున్నారంటే

స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిన నేపథ్యంలో స్క్రీన్‌ప్లే గురించి లవ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌లో చర్చిస్తున్నట్లు దాదా తెలిపాడు. అయితే బిజీ కారణంగా కొంత కాలంగా బయోపిక్‌పై అడుగులు ముందుకు పడలేదన్నాడు. ఈసారి వేగంగా పని పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు వెల్లడించాడు.

-Advertisement-

సంచలనాత్మకంగా మారనున్న గంగూలీ బయోపిక్‌లో హీరోగా రణ్‌బీర్‌ కపూర్‌ కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయని బాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. అయితే, హీరో అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని దాదా తెలిపాడు. మరికొంత మంది పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. లవ్‌ ప్రొడక్షన్స్‌తో భేటీ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని గంగూలీ వెల్లడించాడు.

also read:

niharika konidela : త‌ల్లి కాబోతున్న నిహారిక‌… అందుకే అజ్ఞాతంలోకి వెళ్లిందా..!

pathaan movie review : ‘పఠాన్‌’ తెలుగు మూవీ రివ్యూ

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News