Sunday, May 12, 2024
HomesportsGongadi Trisha : అండర్‌-19 ప్రపంచ కప్‌లో అదరగొట్టిన తెలుగమ్మాయి

Gongadi Trisha : అండర్‌-19 ప్రపంచ కప్‌లో అదరగొట్టిన తెలుగమ్మాయి

Telugu Flash News

ప్రపంచకప్‌ అండర్‌ 19 పోరులో భారత అమ్మాయిలు అదరగొట్టారు. ముఖ్యంగా తెలుగమ్మాయి అయిన త్రిష గొంగడి (Gongadi Trisha) టాప్‌ స్కోరర్‌గా నిలవడంతో ఆమెపై క్రికెట్‌ అభిమానులందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

సౌతాఫ్రికాలో జరిగిన అండర్‌-19 ఉమెన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌లో ((Under-19 Women’s T20 World Cup) భారత్‌ విజయకేతనం ఎగురవేసింది. ఆదివారం సాయంత్రం ఇంగ్లండ్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఇందులో ఏడు వికెట్ల తేడాతో భారత అమ్మాయిలు ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి ట్రోఫీని కౌవసం చేసుకున్నారు.

ప్రతిష్టాత్మక టోర్నీలో తెలుగమ్మాయి త్రిష కీలక పాత్ర పోషించింది. తక్కువ స్కోరు మ్యాచ్‌లోనూ టాప్‌ స్కోర్‌ సాధించింది. టీమిండియా గెలుపులో ముఖ్య భూమిక వహించింది.

soumya, gongadi trisha lead india to winకేవలం 69 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత అమ్మాయిలు.. మూడు ఓవర్ల పరిధిలోనే ఓపెనర్లు వెనుదిరగాల్సి వచ్చింది. అనంతరం క్రీజులోకి వచ్చిన త్రిష.. కాస్త నిలకడగా ఆడింది. టీమ్‌ స్కోరును, జట్టు విజయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆచితూచి ఆడింది.

29 బంతులు ఎదుర్కొన్న త్రిష.. మూడు ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును హ్రిషిత బసుతో కలిసి 46 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పింది త్రిష.

పరుగులు చేయడంతో పాటు అంతకుముందు ఫీల్డింగ్‌లోనూ త్రిష రాణించింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ గ్రేస్‌ స్క్రివెన్స్‌ క్యాచ్‌ను అద్భుతంగా అందుకుంది త్రిష. మొత్తంగా టోర్నీలో అత్యద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ గ్రేస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కింది.

-Advertisement-

తెలంగాణ అమ్మాయే..

తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతానికి చెందిన త్రిష అండర్‌19 వరల్డ్‌కప్‌లో రాణించడంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కినట్లయింది.

భవిష్యత్‌లో ఉమెన్స్‌ జాతీయ జట్టులో రాణిస్తుందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. టోర్నీలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిష అర్ధ శతకంతో రాణించింది.

gongadi trisha
gongadi trisha

51 బంతులు ఎదుర్కొన్న త్రిష 6 ఫోర్ల సాయంతో 57 పరుగులతో ఆ మ్యాచ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. తన ఎనిమిదో ఏట నుంచే క్రికెట్‌లో త్రిష రాణిస్తోంది. అండర్‌16 జట్టులోనూ ప్రతిభ చూపింది.

also read :

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2024 సంక్రాంతికి రిలీజ్ ?

Horoscope Today : 30-01-2023 సోమవారం ఈ రోజు రాశి ఫ‌లాలు

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News